English | Telugu

Suman Shetty Elimination: సుమన్ శెట్టి ఎలిమినేషన్.. కన్నీళ్ళతో బయటకు వచ్చాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో పద్నాలుగో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక అందరు ఎదురుచూస్తున్నట్టుగానే ఈ వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. నాగార్జున గ్లామరెస్ గా రెడీ అయి వచ్చేశాడు. హౌస్ మేట్స్ అందరిని మాట్లాడించాడు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే విషయం ముందే చెప్పేశాడు. ఇక నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేశాడు నాగార్జున. ఇక చివరి ఎలిమినేషన్ రౌండ్ కలర్ బోర్డ్‌ టాస్క్‌తో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశాడు నాగార్జున. సుమన్ శెట్టి ఎలిమినేషన్ అనగానే అందరు షాక్ అయ్యారు. భరణి అయితే ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. యూ ఆర్ ది బెస్ట్.. నీది మంచి మనస్సు.. నేను బయటకు రాగానే కచ్చితంగా మనం వర్క్ చేద్దామని మాటిచ్చాడు భరణి. ఇక ఇమ్మాన్యుయేల్, తనూజ, కళ్యాణ్, సంజన, డీమాన్ ఎమోషనల్ అయ్యారు. 'అధ్యక్షా వెళ్ళిపోతున్నా' అంటు బిగ్ బాస్ కి బై చెప్పేసి బయటకు వచ్చేశాడు. ఇక హౌస్ ని వీడి స్టేజ్ మీదకి వచ్చాడు నాగార్జున.

ఫైనల్ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యావ్ కదా.. ఎలా ఉందని నాగార్జున అడుగగా.. హ్యాపీగానే ఉంది సర్.. ఒక్కవారం ఉంటే టాప్-5కి వెళ్లేవాడ్ని అని సుమన్ శెట్టి అన్నాడు. నేనూ అదే అనుకున్నా.. అరెరే సుమన్ వెళ్లిపోతున్నాడే అనిపించింది.. నీ ఆటతోనే కాదు.. మాటలతోనూ ఆకట్టుకున్నావ్... ఇప్పుడు నీ జర్నీ వీడియో సుమన్ శెట్టి ప్రభంజనం చూద్దామని చెప్పాడు.

అసలు బిగ్ బాస్ హౌస్‌ని వీడిన ఏ కంటెస్టెంట్‌కి దక్కని గుర్తింపు, గౌరవం సుమన్ శెట్టికి దక్కింది. సుమన్ శెట్టి తన ఆటతో ప్రభంజనం సృష్టించాడు అని నాగార్జున గర్వంగా, ఫుల్ ఎలివేషన్ ఇస్తూ చెప్పాడు. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కి ఇంతటి ఎలివేషన్ ఇవ్వలేదు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.