English | Telugu
Sanjana Fires On Emanual: భరణి అవుట్ ఆఫ్ ది రేస్.. ఇమ్మాన్యుయేల్ పై సంజన ఫైర్!
Updated : Dec 13, 2025
బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే కి ఇంకా ఒక్క వారమే టైమ్ ఉంది. హౌస్ లో టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. లీడర్ బోర్డుపై లీస్ట్ లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరుగా టాస్క్ నుండి తొలగిపోతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో లీడర్ బోర్డుపై లీస్ట్ లో భరణి ఉన్నాడు. ఇక నామినేషన్ నుండి సేవ్ అయ్యే ప్రక్రియ నుండి తొలగిపోయాడు. తన దగ్గరున్న పాయింట్స్ లో సగం ఎవరికైనా ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు.
భరణి దగ్గరికి సంజన వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. నాకు పాయింట్స్ చాలా అవసరమని అడుగుతుంది. నేను మాట ఇవ్వలేను ఆలోచించుకోవాలని భరణి చెప్తాడు. ఆ తర్వాత తన పాయింట్స్ అన్ని తనూజకి ఇస్తున్నానని చెప్పి భరణి ఎమోషనల్ అవుతాడు. ఎందుకు ఏడుస్తున్నారని తనూజ అడుగుతుంది. ఏం లేదని భరణి అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో స్కోర్ బోర్డుపై మిగిలిన ముగ్గురు అయిన ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన ఆడుతారు. వాటర్ లో ఉన్న షేప్స్ తాళం తీసి టేబుల్ పై సెట్ చెయ్యాలి.. అలా బజర్ మోగేసరికి ఎవరివి ఉంటాయో వాళ్ళే విన్ అని బిగ్ బాస్ చెప్తాడు. అందులో ముగ్గురు ఒకరి షేప్స్ ఒకరు టేబుల్ పై నుండి తీసి బయటకు విసిరేస్తారు.. అలా ముగ్గురు ఒకరికొకరు తోసుకుంటూ గేమ్ ఆడుతారు. తనూజ,ఇమ్మాన్యుయేల్ ని పట్టుకొని ఆపుతుంది. మనం మనం కొట్టుకుంటే వేరేవాళ్ళు ఆ షేప్స్ పెట్టుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయేల్ విన్ అవుతాడు సెకెండ్ సంజన ఉంటుంది. తనూజ పెట్టిన షేప్స్ అన్ని వాళ్ళు తీసేసారు కాబట్టి తనూజకి ఈ టాస్క్ లో పాయింట్స్ రాలేదు.
టాస్క్ తర్వాత ఇమ్మాన్యుయేల్ పై సంజన గట్టిగా అరుస్తుంది. నాకు ఎప్పుడు సపోర్ట్ చెయ్యలేదు.. మీరు కలిసి గేమ్ ఆడారు.. మనం మనం ఆపుకుంటే వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారన్నావ్ అంటే నేనే కదా అని సంజన ఏడుస్తుంది. నాకు ఎవరు లేరు.. ప్రతీసారీ అందరికి నేనే టార్గెట్ అని ఏడుస్తుంది. మీరు చూసేవాళ్ళకి ఏం పొట్రే చేద్దామనుకుంటున్నారని ఇమ్మాన్యుయేల్ అంటాడు. మరొకవైపు నా షేప్స్ అన్ని తీసి ఫస్ట్ వాటర్ లో నువ్వే వేసావని ఇమ్మాన్యుయేల్ తో తనూజ గొడవ పడుతుంది.