English | Telugu

Brahmamudi:రాహుల్ చెంపచెల్లుమనిపించిన సుభాష్.. కావ్యకి నయం అవుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -902 లో....స్టేషన్ కి రేణుకని పిలిచి అప్పు మాట్లాడుతుంది. నీ కూతురు బ్రతికే ఉందని చిన్న క్లూ దొరికిందని అప్పు అనగానే రేణుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండని అప్పు అనగానే రేణుక వెళ్తుంటే తన భర్త ఎదరవుతాడు. అప్పూనే అతన్ని పిలిపిస్తుంది. మీ కూతురు బ్రతికే ఉందని అప్పు చెప్పగానే అతను కంగారుపడతాడు.

అంతే కాదు పాప చనిపోయిందని ఒక బాడీ చూపించారు కదా ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చెయ్యాలని అనుకుంటున్నాం.. దాంతో అన్ని నిజాలు బయటకు వస్తాయని అప్పు అనగానే అతను ఇంకా కంగారుపడతాడు. మంచిదే కదా మేడమ్ అని అతను అంటాడు. మీరు ఇప్పుడు వెళ్ళండి అని అప్పు అనగానే.. అతను వెళ్తాడు. మరొకవైపు రాజ్, కావ్యలని రౌడీలు బంధించగా రాజ్ తన తాళ్లు విప్పుకొని రౌడీలని కొడతాడు. అప్పుడే చోటు, మోటుల హెడ్ బాస్ అయిన పెద్ద విలన్ అక్కడికి వచ్చి రాజ్ ని గన్ చూపించి బెదిరిస్తాడు. అప్పుడే పోలీసులు వచ్చి రౌడీలని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత సుభాష్ కి శృతి ఫోన్ చేసి మన క్లయింట్స్ అందరు రాహుల్ సర్ కంపెనీతో డీల్ పెట్టుకున్నారు. రాహుల్ సర్ ప్రెజెంట్ చేసిన డిజైన్స్ మొత్తం కూడా కావ్య మేడమ్ వేసినట్లు ఉన్నాయని శృతి చెప్తుంది. దానికి సంబందించిన ఫొటోస్ అన్ని సుభాష్ కి పంపిస్తుంది. అది చూసి సుభాష్.. ఈ రాహుల్ వెన్నుపోటు పొడిచాడు అని షాక్ అవుతాడు.

మరొకవైపు కావ్యకి చేస్తున్న ఆయుర్వేద వైద్యం పూర్తి అవుతుంది. ప్రాబ్లమ్ 99% తగ్గిందని అతను చెప్తాడు. దాంతో రాజ్, కావ్య హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత రాహుల్ డిజైన్స్ చూసి ఇంట్లో వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే సుభాష్ వచ్చి రాహుల్ చెంపచెల్లుమనిపిస్తాడు.. కావ్య డిజైన్స్ దొంగతనం చేసావని అంటాడు. లేదు మావయ్య నేను వేసానని రాహుల్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.