చిరు కావాలంటున్న ముదురు భామలు
చిరంజీవి 150వ సినిమా కోసం కథానాయిల మధ్య పోటీ ఎక్కువవుతోంది. ఇప్పటికే చిరు పక్కన నటించాలని వుంది అని చాలామంది కథానాయికలు తమ మనసులోని మాట చెప్పేశారు. ఇప్పుడు మరో ఇద్దరు ముదురు భామలు జత కలిశారు. వాళ్లే శిల్పాశెట్టి, రవీనాఠండన్. ఈ బాలీవుడ్ భామలు తెలుగులోనూ సినిమాలు చేశారు. అదీ.. టాప్ స్టార్లతో. కానీ చిరంజీవితో కలసి నటించే అవకాశమే రాలేదు. అందుకే చిరు సినిమాలో నటించాలని వుంది అని తమ మనసులోని మాట బయటపెట్టారు..