English | Telugu
బాలకృష్ణ స్టైల్ మారుస్తున్నాడు
Updated : Jul 20, 2015
నందమూరి బాలయ్య ఈ మధ్య కాలంలో తానెప్పుడూ కనిపించనంత స్టైలుగా కనిపిస్తానని చెబుతున్నాడు. లుక్ విషయంలో డైరెక్టర్ శ్రీవాస్ ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడని.. ‘డిక్టేటర్’ తన లుక్ చూసి జనాలు ఆశ్చర్యపోతారని ఓ ప్రైవేటు కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులకు చెప్పాడు బాలయ్య. లయన్ సినిమాలో మరీ లావుగా కనిపించి ప్రేక్షకుల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన బాలయ్య డిక్టేటర్ కోసం 12 కిలోల బరువు తగ్గడం విశేషం. ‘డిక్టేటర్’లో స్టైల్ ఫ్యాక్టర్ కచ్చితంగా హైలైట్ అవుతుందనే అనిపిస్తోంది. రెండు నెలల కిందటే ముహూర్తం జరుపుకున్న ‘డిక్టేటర్’ సోమవారమే సెట్స్ పైకి వెళ్లనుంది. రామానాయుడు స్టూడియోలో జరిగే తొలి షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.