English | Telugu
అమీర్ ని ఏడిపించిన సల్మాన్
Updated : Jul 20, 2015
ముంబయిలో భజరంగి భాయిజాన్ స్పెషల్ షో చూసిన అమీర్ తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. భజరంగి భాయిజాన్ చూసి బయటికి చెమర్చిన కళ్లతో వచ్చిన అమీర్.. కర్చీఫ్ తో కళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. ఆ సందర్భంగా మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిన అమీర్.. ఆ తర్వాత ట్విట్టర్లో సినిమా గురించి స్పందించాడు. ‘‘సినిమా చాలా బాగుంది. ఇప్పటివరకు సల్మాన్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్. సల్మాన్ నటన అద్భుతం. అతను కన్నీళ్లు పెట్టించాడు. కథ కథనం డైలాగ్స్ చాలా బాగా కుదిరాయి. కబీర్ ఖాన్ చక్కటి సినిమా తీశాడు. అందరూ చూడదగ్గ సినిమా. చిన్నపాప హర్షాలీ మీ మనసులు దోచుకుంటుంది’’ అని ట్వీట్ చేశాడు అమీర్.