English | Telugu
'భాయ్‌జాన్' టైమ్ షూరూ
Updated : Jul 18, 2015
సల్మాన్ ఖాన్ సినిమాల్లో కథా విలువలు లేకుండా కేవలం కమర్షియల్ హంగులతోనే బాక్సాఫీస్ వద్ద కోట్లకి కోట్లు వచ్చి పడిపోతుంటాయి. అసలు సల్మాన్ చిత్రంలో కాస్త కథ కూడా వుండి, తన అభిమానుల్తో పాటు ఇతర వర్గాలని కూడా ఆకట్టుకోగలిగితే ఇక దానికి వసూళ్లు ఎలా వుంటాయంటూ ఎప్పటికప్పుడు సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా, భాయ్ ఆ కామెంట్స్ పట్టించుకోలేదు. ఎప్పుడూ మసాలా సినిమాల వెంట పడే సల్మాన్‌ఖాన్ తన తాజా చిత్రం 'బజరంగి భాయ్‌జాన్'లో మాత్రం తన ఇమేజ్‌కి అతీతమైన పాత్ర చేశాడు.
అమాయకుడు, అతి మంచోడు అయిన ఆంజనేయుడి భక్తుడిగా కథకి తగ్గట్టు ఒదిగిపోయి, నటుడిగా మెప్పించాడు. కంట తడి కూడా పెట్టించాడు. సల్మాన్ ఖాన్ ఇంతలా నటించడం చూసి చాలా కాలం అవడంతో బాలీవుడ్ అంతా భాయ్‌కి సలామ్ కొడుతున్నారు. తనకి ఇష్టమైన రంజాన్ పండగ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఈ టాక్‌తో ఖచ్చితంగా రెండు వందల కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తుందని నమ్మకం కలిగించింది. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర భాయ్ ఎన్ని రికార్డులు బద్దలుకొడతాడో.