రెండు మర్దర్లు చేసిన ఖైదీతో సంజయ్ దత్ షేవింగ్.. బయటపడిన అసలు నిజం
సంజయ్ దత్(Sanjay dutt)నటప్రస్థానం, వాటిల్లో సంజయ్ దత్ నటన గురించి భారతీయ సినీ ప్రేమికులకి క్షుణంగా తెలుసు. నాలుగు దశాబ్దాల క్రితం సినీ రంగంలోకి ప్రవేశించిన సంజయ్ దత్, ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ని అందుకోవడంతో పాటు, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. జెట్ స్పీడ్ వేగంతో దూసుకెళ్తున్న తన కెరీర్ కి 1993 వ సంవత్సరంలో బ్రేక్ పడింది, ముంబై బాంబుపేలుళ్ల సమయంలో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు 'టాడా' కేసు నమోదు కావడంతో జైలు పాలయ్యాడు.