English | Telugu

సైఫ్ పై జరిగిన దాడి అబద్దమా!..ఛీ మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం

అగ్రనటుడు 'సైఫ్ అలీఖాన్'(Saif Ali khan)పై ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ కి చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో డబ్బుల కోసమే సైఫ్ పై దాడి చేసినట్టుగా అంగీకరించాడు. అప్పట్లో ఈ దాడి పెద్ద సంచలనమే సృష్టించింది. ఇందుకు సంబంధించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. సైఫ్ హాస్పిటల్ లో కూడా జాయిన్ కావడంతో అభిమానులు ఎంతగానో ఆందోళన చెందారు.

రీసెంట్ గా సైఫ్ ప్రైమ్ వీడియో వేదికగా కాజోల్(Kajol),ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna)హోస్ట్ లుగా వస్తున్న 'టూ మచ్'(Two Munch)టాక్ షోలో పాల్గొన్నాడు. తనపై దాడి జరిగిన తర్వాత సంభవించిన పలు పరిణామాలపై మాట్లాడుతు 'నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తర్వాత హెల్త్ పరంగా ఇబ్బందిగా ఉన్నాఆ విషయాన్నీ దాచుకొని వీల్ ఛైర్ లో కాకుండా నడుచుకుంటూ కారు దగ్గరకి వెళ్ళాను. బయట మీడియా వాళ్ళు నా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో నేను ఇబ్బందిగా వెళ్తే అభిమానులు ఆందోళన చెందుతారేమో అని నొప్పిని భరిస్తూనే వెళ్ళాను. దాంతో నాపై జరిగిన దాడి నాటకమని కొంత మంది వార్తలు రాసారు. అలాంటి వార్తలు విన్నప్పుడు అసలు మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అనిపించిందని తన ఆవేదనని వెల్లడి చేసాడు.

కెరీర్ పరంగా చూసుకుంటే సైఫ్ ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన 'జ్యువెల్ థీఫ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో హైవాన్, జిస్మ్ పార్ట్ 3 చిత్రాలు ఉన్నాయి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వన్ మాన్ షో దేవర పార్ట్ 2 కూడా ఉన్న విషయం తెలిసిందే.