English | Telugu

అడల్ట్‌ కంటెంట్‌ వల్ల సినిమా బ్యాన్‌.. అయినా ఓటీటీలో చూడొచ్చు.. అదెలా?

ఒకప్పుడు సినిమా అంటే ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ఎంతో కొంత విజ్ఞానాన్ని అందించేది. సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఏదైనా సమస్య వస్తే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాల గురించి అంతర్లీనంగానే ఆ సినిమాలో చర్చించేవారు. కానీ, రాను రాను సినిమా అంటే కేవలం యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే అనే ధోరణి ప్రేక్షకుల్లో బాగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే దర్శకనిర్మాతలు కూడా తమని తాము మార్చుకొని ఆ తరహా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మన సినిమాల్లో నైతిక విలువలకు ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. అయితే అడపా దడపా కొందరు దర్శకనిర్మాతలు అలాంటి సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నా.. వారికి పరాజయం తప్పడం లేదు.

ప్రజెంట్‌ జనరేషన్‌ని చూస్తే... యాక్షన్‌ సినిమాలతోపాటు క్రైమ్‌, హారర్‌, శృతి మించిన సెక్స్‌ సన్నివేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది వివిధ ప్లాట్‌ఫామ్స్‌పై అందుబాటులో ఉండడంతో ఎవరికి నచ్చిన కంటెంట్‌ను వారు చూస్తున్నారు. ప్రేక్షకుల పల్స్‌ను పట్టుకున్న కొందరు మేకర్స్‌.. హారర్‌, క్రైమ్‌ సీన్స్‌తోపాటు కొన్ని బోల్డ్‌ సీన్స్‌ కూడా సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి అడల్ట్‌ కంటెంట్‌తో వచ్చిన ఓ సినిమాను ఇప్పుడు ఇండియాలో బ్యాన్‌ చేశారు. కానీ, అదే సినిమా, అదే కంటెంట్‌తో అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఆ సినిమా పేరు ‘ఆగ్రా’.

ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాల కంటే ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న సినిమాలు చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వివిధ ఓటీటీ సంస్థలు స్ట్రీమ్‌ చేస్తున్న సినిమాల్లో అన్ని రకాల జోనర్స్‌ ఉండడం, ముఖ్యంగా బోల్డ్‌ సీన్స్‌ విషయంలో ఓటీటీకి సెన్సార్‌ అనేది లేకపోవడంతో అలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమాల్లో నటించే హీరోయిన్లు కూడా అందాలు ఆరబోసేందుకు, కొన్ని ఇంటిమసీ సీన్స్‌లో నటించేందుకు అభ్యంతరం చెప్పడం లేదు. దీంతో ఓటీటీ సినిమాల జోరు బాగా పెరిగింది.

ఇండియాలో బ్యాన్‌ అయిన ‘ఆగ్రా’ సినిమా గురించి చెప్పాలంటే.. ఇది ఒంటరిగా చూడాల్సిన సినిమాయే తప్ప ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూడదగ్గ సినిమా కాదు. సినిమాలో లెక్కకు మించిన బోల్డ్‌ సీన్స్‌ ఉంటాయి. ఇందులో రుహానీ శర్మ నటించడంతో సినిమాకి క్రేజ్‌ వచ్చింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ్‌, హిందీ సినిమాల్లో కొన్ని పద్ధతిగల పాత్రలు పోషించిన రుహానీ.. ‘ఆగ్రా’ సినిమాలో రొమాంటిక్‌ సీన్స్‌తో దుమ్ము రేపింది. ఇండియాలో ఈ సినిమా బ్యాన్‌ అయింది. అంతేకాదు, ఓటీటీలో కూడా ఇండియన్‌ లాంగ్వేజ్‌లో ఈ సినిమాను స్ట్రీమ్‌ చేసే అవకాశం లేదు. దీంతో ఫ్రెంచ్‌ భాషలోకి ఈ సినిమాను డబ్‌ చేసి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ చేస్తున్నారు. దాంతో ఫ్రెంచ్‌ అర్థం కాకపోయినా సబ్‌ టైటిల్స్‌తో అడ్జస్ట్‌ అవుతూ తమకు కావాల్సిన కంటెంట్‌ని చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు ప్రేక్షకులు.