English | Telugu

సోనియా షాకింగ్ పోస్ట్.. సైలెంట్ గా ఉండేవాడిలో వైల్డ్ ఫైర్ ఎందుకొచ్చిందో!

ఇదే చివరి నామినేషన్స్ అని రెచ్చిపోయారో.. లేదంటే విన్నర్ నువ్వైనా అవ్వాలి.. లేదంటే నేనైనా అవ్వాలి కాబట్టి.. ఇద్దరిలో నువ్వోనేనో తేలాలనుకున్నారో ఏమో కానీ ఈ చివరి నామినేషన్స్‌లో నిఖిల్, గౌతమ్‌లు రెచ్చిపోయారు. నిన్నటి వరకు సైలెంట్‌గానే కనిపించిన నిఖిల్.. ఒక్కసారిగా గౌతమ్‌పైకి దూసుకుని వెళ్లాడు. ఇంకోసారి నోరు జారితే వేరేలా ఉంటుందని వైల్డ్ ఫైర్ చూపించారు.

బిగ్ బాస్ సీజన్-8 లో సోనియా ఉన్నంతసేపు కథ వేరే ఉండేది. బయటకొచ్చాక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అది వేరే విషయం.. అయితే తను మళ్ళీ హౌస్ లోకి వచ్చి నిఖిల్ ని నామినేట్ చేయడంతో ఫుల్ హాట్ టాపిక్ అయ్యింది సోనియా.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన నామినేషన్ లో గౌతమ్ మీదకి నిఖిల్ ఫుల్ ఫైర్ అవుతూ అగ్రెసివ్ గా మాట్లాడాడు. ఇన్నివారాలలో ఒక్క వారం నామినేషన్ లో కూడా నిఖిల్ ఇంత అగ్రెసివ్ అవ్వలేదు‌. అంతలా రెచ్చిపోయిన నిఖిల్ గురించి సోనియా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం.. ఏదైనా సరే బారాబర్ ముఖం మీద చెప్పాలి.. కానీ కొంతమంది ఇండైరెక్ట్‌గా వెనకాల నెగెటివ్ చేస్తారు.. నిజానికి ఈ మాట అక్కడ ఆ మాట ఇక్కడా చెప్పే అలవాటు ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుంది.. కానీ అదే క్వాలిటీ మగాళ్లలో ఉంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.. అలాంటి వాళ్లు వాళ్ల మనసులో ఉన్న చెడు కనబడకుండా పైకి ముసుగేసుకొని మోసం చేస్తారు.. అయిన ఎప్పుడూ సైలెంట్‌గా ఉండేవాడితో ఇంత వైల్డ్ ఫైర్ ఎందుకొచ్చిందో అంటూ పోస్ట్ పెట్టింది సోనియా ఆకుల. నిఖిల్‌లో సడెన్‌గా వైల్డ్ ఫైర్ బయటకు రావడం.. సోనియా సడెన్‌గా ఈ వైల్డ్ ఫైర్ ఎందుకు బయటకు వచ్చిందో అని సందేహిస్తూ పోస్ట్ పెట్టడాన్ని బట్టి చూస్తే అర్ధమయ్యే ఉంటుంది కదా.. ఇది నిఖిల్ కోసమేనని. ఎందుకంటే ఆ పోస్ట్ లో అంత డెప్త్ ఉంది. ఇక ఈ పోస్ట్ లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.