English | Telugu

రెహమాన్ ఈసారీ మిస్సయ్యాడు...

నాలుగేళ్ళ క్రితం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు కొట్టిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డ్ కొట్టాలన్న తపనతో వున్నాడు. అందుకే ఆయన ఈమధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలకే సంగీతాన్ని అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈసారి పోటీలో వున్న నామినేషన్ల వివరాలను ఆస్కార్ కమిటీ ప్రకటించింది. ఆ లిస్టులో ఎ.ఆర్.రెహమాన్ పేరు లేదు. ఇది రెహమాన్‌ని చాలా నిరాశపరచినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం ఆస్కార్ వచ్చిన తర్వాత మరో ఏడాది ఆస్కార్ వేదికపై