English | Telugu

'బాహుబలి' ట్రైలర్ వచ్చేస్తోంది

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకేక్కిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం బాహుబ‌లి. సినీ అభిమానులలో ఈ చిత్రంపై ఆస‌క్తి, అంచ‌నాలు భారీగా నెలకొనివున్నాయి. ఈ నేప‌థ్యంలో బాహుబ‌లి కోసం అభిమానులను ఎక్కువగా ఎదురుచూసేలా చేయ‌డం ఇష్టం లేని రాజమౌళి ఓ ప్రచార చిత్రాన్ని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని భావించాడ‌ట‌. దాంతో ఫిబ్రవ‌రి మొద‌టి వారంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట. గ్రాఫిక్ వర్క్స్ ప్రాధాన్యం ఉన్న ఈ మూవీ ట్రైలర్ కూడా ఫస్ట్‌లుక్‌లోనే అదిరేలా, సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంటుందని యూనిట్ టాక్. ఈ సినిమాపై ఆసక్తిగా వున్న సినీ అభిమానులు, ఈ ట్రైల‌ర్‌ని ఏ స్థాయిలో చూస్తారో?