English | Telugu

టెంప‌ర్ ఆడియో మళ్ళీ వాయిదా

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఎదురుచూపులు త‌ప్ప‌డం లేదు. ద‌యా గాడి దండ‌యాత్రని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని గంపెడాశ‌ల‌తో ఎదురుచూస్తుంటే ఆ క్ష‌ణాలు వెన‌క్కు వెన‌క్కు వెళ్తున్నాయి. జ‌న‌వ‌రి 9 నుంచి ఫిబ్ర‌వ‌రి 5కు వాయిదా ప‌డింది టెంప‌ర్‌. ఇప్పుడు 13కి వెళ్లింది. పాట‌ల విడుద‌ల కూడా వాయిదా వేశారు. జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయాల్సిన పాట‌లు ఇప్ప‌డు జ‌న‌వ‌రి 31కి వాయిదా వేశారు. సినిమా మాత్రం ముందు అనుకొన్న‌ట్టుగానే ఫిబ్ర‌వ‌రి 13నే తీసుకొస్తామంటోంది చిత్ర‌బృందం. మరోవైపు ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని మ‌రింత పెంచేస్తున్నాడు ప్ర‌కాష్‌రాజ్‌. ''టెంప‌ర్‌లో కొన్ని సీన్స్ చూశాను. ఎన్టీఆర్ మండిపోతున్నాడు... ఎన్టీఆర్ - పూరి ఇది వ‌ర‌కు అందించ‌నంత వినోదం పంచిపెట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యారు..'' అంటూ ట్వీట్ చేశాడు.