ఏమీ సేతుర ‘లింగ’?
విడుదలయ్యాక పరిస్థితి ఎలా వుంటుందోగానీ, రజనీకాంత్ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లింగ’ సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక తమిళనాడు ప్రేక్షకులైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నారు. ఇన్ని అంచనాలు, ఎదురుచూపులున్న ఈ సినిమా ఆడియో ఈమధ్య విడుదలైంది. తమిళనాడు సంగతి తెలియదుగానీ, తెలుగు పాటలు మాత్రం ‘ఎక్కేలా’ లేవని సంగీత ప్రియులు అంటున్నారు. ఎ.ఆర్.రెహమాన్