English | Telugu

నయనతార 'పాత ప్రేమ కథ'

దక్షిణాది హీరోయిన్లలో లవ్ అఫైర్లతో వార్తల్లో నిలిచే వారిలో నయనతార ఒకరు. దాని వల్ల ఒక దశలో ఆమెకు సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అయితే లేటెస్ట్ గా నయనతార, శింబుల మధ్య పాత ప్రేమ కథ మళ్లీ చిగురిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి ప్రేమకథ మళ్లీ మొదటికే వస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలసి ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో వీరిద్దరు ఒకరికొకరు బాగా దగ్గరయ్యినట్లు సమాచారం. శింబు బర్త్‌ డే రోజున ఈ అమ్మడు శింబు కోసం స్పెషల్ గా ఓ కేకు తెప్పించి హడావుడి చేసిందట. ఇది చూసిన ఇండస్ట్రీ వర్గాలు పాత లవర్ తో సినిమా చేస్తున్న ఆమె మళ్లీ పాతరోజుల్లోకి వెళ్తోందని గుసగుసలాడుకుంటున్నారు.