English | Telugu

సీనియర్ నటుడి మీద సోనియా ఫైర్

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ జోడి సీజన్-3 లో ఈ వారం ఎలిమినేషన్స్ రౌండ్ చాలా గట్టిగానే ఉండబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఈ నామినేషన్స్ లో భాగంగా సోనియాకి, ప్రదీప్ కి మధ్య వాదోపవాదాలు జరిగాయి. "ఈ నలుగురిని నేను పిల్లలు అనుకుంటే ఇప్పుడు ఆ నలుగురే వచ్చి మమ్మల్ని ఎలిమినేట్ చేయడం అనేది నాకు కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది.

ఇప్పుడు సొసైటీలో నడుస్తున్న ట్రెండ్ ఇదే...మేము సోనియాని ఒక నాలుగు సార్లు నామినేట్ చేయాలని అనిపించినా నా బిడ్డ లాంటిది అని ఈ నలుగురిలో ఎవరిని నామినేట్ చేసినా బాధపడతారు అని మేము అనుకున్నాం. కానీ మీరు అయ్యో పెద్దవాళ్ళు, తల్లితండ్రుల లాంటి వాళ్ళు..వాళ్ళను నామినేట్ చేస్తే బాధపడతారు అని ఈ తరం అనుకోలేదు" అని ప్రదీప్ కాస్త సీరియస్ గా అన్నారు. దానికి సోనియా ప్రదీప్ మీద ఫుల్ ఫైర్ అయ్యింది. "ఎలిమినేషన్ అనేది టాస్క్ బేస్డ్ గా ఉంది కాబట్టి మెం నలుగురు కలిసి నామినేట్ చేసాము. ఇదేమీ ట్రెండ్ కాదు. ఇప్పటి మా ట్రెండ్ ఏంటంటే మేము ఈరోజు ఏదైనా నేర్చుకుంటే దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అదే మా ట్రెండ్ " అని సోనియా చాలా ఘాటుగా జవాబు ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అమర్‌దీప్- తేజు, యష్-సోనియా, అభయ్ నవీన్-భవానీ, అనిల్ గీలా-ఆమని జోడీలు కలిసి ప్రదీప్-సరస్వతి జంటని నామినేట్ చేశాయి. దీంతో ప్రదీప్ చాలా హర్ట్ అయ్యారు. మరి ఇంకా ఎలా రియాక్ట్ అయ్యారో చూడాలంటె కొన్ని గంటలు ఆగాలి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.