English | Telugu

Karthika Deepam2: జ్యోత్స్నని నిలదీసిన దశరథ్.. కార్తీక్ కావాలనే అలా చేశాడు!

స్టార్ మ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-364లో.. జ్యోత్స్న చేసిన అగ్రిమెంట్ గొడవ గురించి శివనారాయణ మాటల్లో దశరథ్, సుమిత్ర తెలుసుకుని షాక్ అవుతారు. జ్యోత్స్న దొరికేసింది ఇప్పుడు ఎలా అని పారిజాతం భయపడుతుంది. అయితే అంతా అగ్రిమెంట్ గురించి నిలదీసేసరికి.. జ్యోత్స్న ఓ కథ అల్లేసింది. నేను ఆ రోజు దీప ఆసుపత్రిలో ఉన్న రోజు.. నలుగురి తీసుకుని బ్లెడ్ ఇవ్వడానికి నలుగురిని తీసుకుని వెళ్లా కదా? ఆ సత్యరాజ్ అంకుల్ ఏదో బావంటే అంత ప్రేమ ఉన్నట్లు మాట్లాడతాడు కానీ.. దీప ఆపరేషన్‌కి డబ్బులు కూడా ఇవ్వలేదట.. సో దీప ఆపరేషన్‌కి డబ్బులు కావాలి బ్లడ్ కావాలి.. బావ ఇంటికి వస్తే మనం అన్న మాటలన్నీ అవమానంగా ఫీలయ్యాడట.. వెళ్లగానే నన్ను చూసి తాతను తిట్టాడు. కొన్ని చెప్పలేను కానీ తాతను గట్టిగానే తిట్టాడు. బావ తాతను అన్ని మాటలు అన్న తర్వాత నేను ఊరికే ఎలా ఉంటాను.. ఆ కోపంలో ఇచ్చిన డబ్బులకు అగ్రిమెంట్ రాయమన్నాను.. బావ పౌరుషానికి పోయి నేను ఎంతకైనా సిద్ధమే అన్నాడంటూ జ్యోత్స్న చెప్తూనే ఉంటుంది. 

అబ్బా భానుమతి...ఎంత అందంగా ఉన్నావో పళ్ళ తోటలాగా

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కిట్టి పార్టీగా తీసుకురాబోతోంది. ఈ ఎపిసోడ్ కి చక్రవాకం సీరియల్ హీరోయిన్ ప్రీతి అమీన్, ఋతురాగాలు శృతి, నటకుమారి, అమూల్య గౌడ వంటి వాళ్లంతా వచ్చారు. "బేసిక్ గా కిట్టి పార్టీలో రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. మీకు ఏ గేమ్ ఇష్టం" అని అడిగింది హోస్ట్ శ్రీముఖి. "నాకు ఏ గేమ్ ఐనా గెలవడం ఇష్టం. అందుకే నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను" అని చెప్పింది ప్రీతీ...ఇక శృతి బ్యాగ్ చూసి శ్రీముఖి షాక్ అయ్యింది. "అమ్మో శృతి అక్క చూడు ఎంత పెద్ద బ్యాగ్ తెచ్చిందో" అనేసింది. గెలిస్తే వచ్చే డబ్బులు తీసుకెళ్లడానికి వీళ్ళు ఇంత పెద్ద బ్యాగ్ లు తెచ్చారు అన్నాడు హరి.

Brahmamudi : రుద్రాణి మాటని పట్టించుకోని రాజ్.. కావ్య మీకేమవుతారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-727లో.. ప్లాన్ ఫెయిల్ అయ్యిందని యామినికి రుద్రాణి చెప్పడంతో తను మరో ఐడియా ఇస్తుంది. ఆ కళావతికి.. అత్తయ్యా, మావయ్య, అమ్మమ్మ, తాతయ్యా అంతా ఉన్నారు సరే.. మరి అత్త కొడుకు ఏమయ్యాడనే ప్రశ్నను రాజ్ ముందు పెట్టండి. అప్పుడు రాజ్.. అందరిని నిలదీస్తాడు. ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. రాజ్ తన కొడుకు అన్న నిజం చెప్పలేక, కావ్య తన కోడలు ఎలా అయ్యిందో చెప్పలేక అపర్ణాదేవి గారు తెల్లముఖం వేస్తారంటూ యామిని చెప్తుంది. సూపర్ ఉంది ఐడియా ఇప్పుడే రాజ్‌తో మాట్లాడతానని రుద్రాణి అతని దగ్గరికి వెళ్తుంది.

Illu illalu pillalu: ట్యూషన్ గురించి శ్రీవల్లి పెట్టిన చిచ్చు.. ధైర్యంగా మాట్లాడిన ప్రేమ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-164లో.. రామరాజు, చందులకి శ్రీవల్లి భోజనం తీసుకొని వస్తుంది. ఇక అక్కడ తన డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఇక రామరాజు తనకి మంచి కోడలు దొరికిందని సంబరపడతాడు. ఇంట్లో మీకు తెలియకుండా ప్రేమ ట్యూషన్ స్టార్ట్ చేసింది.. నలుగురికి తెలిస్తే మన కుటుంబ గౌరవం ఏమవుతందని రామరాజుకి అన్నీ ఎక్కించి చెప్తుంది శ్రీవల్లి. మరి బుజ్జమ్మ నాకు చెప్పలేదని రామరాజు అనగా.. అత్తయ్యకి తెలుసు వాళ్ళంతా ఒక్కటే అని శ్రీవల్లి అంటుంది. 

Karthika Deepam2:  తాత తలవంచేలా చేసిన దీప.. గెలిచిన కార్తీక్ బాబు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2(Karthika Deepam2)'.  ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-363లో.. జ్యోత్స్న అవార్డు అందుకుంటున్నట్టు పగటికలలలు కంటుంది. అంతలోనో కార్తీక్‌ని అవార్డ్ అందుకోవడానికి రమ్మని మైక్ లో  అనౌన్స్ చేస్తారు. ఆ అలికిడికి కలలోంచి బయటికి వచ్చిన జ్యోత్స్న.. జరగబోయేది ఇదే కదా అనుకుంటుంది. తీరా స్టేజ్ మీద నుంచి కార్తీక్‌ని పిలిచేసరికి.. జ్యోత్స్ననే పైకి వెళ్లి.. అవార్డ్ అందుకునేది నేను.. కార్తీక్ కాదు... నీ నోటితో నువ్వే చెప్పు బావా.. అందరికీ క్లారిటీ వస్తుందని జ్యోత్స్న అంటుంది. ఇక కార్తీక్ స్టేజ్ పైకి వెళ్లి.. సత్యరాజ్ గారు ఈ ఒక్క విషయాన్ని వదిలెయ్యండి.. నాకు అంగీకారమే జ్యోత్స్నకు అవార్డ్ ఇవ్వడమే అంటాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో అవార్డ్ అందుకునేది కార్తీక్ కాదు. జ్యోత్స్నే అంటూ యాంకర్  అనౌన్స్ చేస్తుంటుంది. 

హోటల్ రూమ్ బుక్ చేసుకుని నేను అష్షు...

ఫ్యామిలీ స్టార్  నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బుల్లితెర ఉన్న సగం స్టార్స్ అలాగే సింగర్స్ కూడా వచ్చారు. సమీరా భరద్వాజ్, సాకేత్ కొమాండూరి, పవిత్ర, టేస్టీ తేజ, తేజస్విని గౌడ, శోభా శెట్టి, రచ్చ రవి, పంచ్ ప్రసాద్, రంగస్థలం మహేష్ వంటి వాళ్లంతా వచ్చారు. ఐతే ఇక్కడ అష్షు రెడ్డి, చొక్కారావు స్రవంతి ఇద్దరూ కలిసి బాంగ్ కాక్ అని ఒకరు, కాదు గోవా అని ఒకరు పోటీ పడుతూ ఉండేసరికి సుధీర్ ఒక డౌట్ అడిగాడు. "గోవా అంటున్నారు, బాంగ్ కాక్ అంటున్నారు.. ఉండడానికి ఏది బెస్ట్ ప్లేస్" అని సుధీర్ అడిగేసరికి "నీకైతే తీహార్ కరెక్ట్ ఏమో అని నా డౌట్" అంది సమీరా..దాంతో సుధీర్ షాకైపోతాడు.

బిగ్ బాస్ సీజన్ 9 కి ఛాన్స్ వస్తే వస్తావా ?

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోందన్న వార్త ఇప్పుడు బిగ్ బాస్ ఫాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఐతే ఓల్డ్ బిగ్ బాస్ సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ ఈ కొత్త సీజన్ లో చూడొచ్చా అని కూడా కొంతమంది ఫాన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్జె కాజల్ ని కూడా అలాగే అడిగారొక ఫ్యాన్. "బిగ్ బాస్ సీజన్ 9 మిమ్మల్ని చూడొచ్చా" అని.. దానికి కాజల్ తన ఆన్సర్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "జీవితంలో కొన్ని విషయాలు చాలా విలువైనవి..వాటిని ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. మనసుకు హత్తుకునే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే వదిలేయాలి కానీ వాటిని మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోకూడదు.

విరాట్ కోహ్లీ..ఎంఎస్.ధోని ? ఇది చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి ప్రిన్సి, తేజస్విని గౌడ, ఐశ్వర్య పిస్సే వచ్చారు. స్టేజి మీదకు రాగానే వీళ్లంతా రాగానే వాళ్ళను కళ్ళు మూసుకోమని చెప్పి  చేతుల్లో చిన్న చిన్న డబ్బాలు పెట్టింది. నెమ్మదిగా పెట్టె మూత తీసి లోపల చెయ్యి పెట్టి ఏమున్నాయో చూడమని టాస్క్ ఇచ్చింది. ఇక వాళ్ళు లోపల చూసేసరికి పాములు, తేళ్లు, జెర్రెల వంటి అన్ని జీవాలకు చెందిన ప్లాస్టిక్ బొమ్మల్ని పెట్టింది. ఇక ఒక్కో బుల్లితెర నటి వాటి చూసి పరుగో పరుగు. అందరూ భయపడిపోయారు. ఇక సుమ వీళ్ళతో బ్యూటీస్ రాంప్ వాక్ పేరుతో ముందు సింగల్ గా వీళ్ళను నడిపించింది. తర్వాత అందరినీ టీమ్ గా కలిసి నడవమని చెప్పింది.