English | Telugu

నా కన్నీళ్లతో కడుగుతున్నా నీ మెట్లు..దుర్గమ్మా...నీవే దిక్కు సుమా


తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులకు బయట కానీ జీవితంలో కానీ ఎన్నో కష్టాలు ఉంటాయి. బుల్లితెర మీద జానులిరి లైఫ్ లో కూడా అన్నే కష్టాలు ఉన్నాయి. ఆమె ఒక ఫోక్ డాన్సర్. ఢీ డాన్స్ షోలో ఆమె చేసిన డాన్స్ తో ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది. ఆ ఇమేజ్ తోనే డాన్స్ ఐకాన్ సీజన్ 2 షోకి మెంటార్ గా కూడా వచ్చింది. అలాంటి జాను లైఫ్ లో మ్యారేజ్ విషయంగా కొన్ని ఇష్యుష్ ఉన్నాయని కొన్ని ఇంటర్వూస్ లో కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమెకు తన కొడుకు లిరి తప్ప వేరే దేనికి ఇంపార్టెన్స్ లేదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాంటి జాను దుర్గమ్మ సన్నిధికి చేరుకొని ఆమె ఆశీర్వాదాలు కోసం మోకాళ్ళ మెట్ల పూజ చేసింది. కోనేటిలో తలారా పవిత్ర స్నానం చేసి పసుపు కుంకుమ తీసుకుని మోకాళ్ళ మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళింది. "నీళ్లతో కాదమ్మ నా కన్నీళ్లతో కడుగుతున్నా నీ మెట్లు... ఎవ్వరు లేకున్నా నాకు నువ్వున్నావన్న ధైర్యం...ఆ తర్వాత నీ ఇష్టం దుర్గమ్మ" అని చెప్తూ ఆ మెట్ల పూజ మొత్తాన్ని కూడా వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే కామెంట్ సెక్షన్ ని లిమిట్ చేసింది జాను. ఐతే రీసెంట్ గా జాను రెండో పెళ్లి చేసుకోబోతోంది అన్న విషయం మీద సోషల్ మీడియాలో బాగా రచ్చ రాజుకున్న విషయం తెలిసిందే.

శేఖర్ మాష్టర్ గురించి, జానూ గురించి నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక జాను కూడా ఒక వీడియోని రిలీజ్ చేసింది. తన జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారంటూ.. తనకు చావే శరణ్యం అంటూ కూడా ఆ వీడియోలో చెప్పింది. జానూ ఎపిసోడ్ సోషల్ మీడియాలో రెండు రోజులు హడావిడి నడిచింది. తర్వాత తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని..పెళ్లి చేసుకున్నాక కూడా తన కొడుకుతో కలిసి హాయిగా జీవిస్తానని చెప్పుకొచ్చింది. కొంత మంది నెటిజన్స్ తిడితే ఇంకొంత నెటిజన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డారు. తర్వాత తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని కూడా చూపించింది జాను.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.