English | Telugu

Illu illalu pillalu:  గుండెల్ని పిండేసిన అన్నదమ్ముల అనుబంధం.. ఒక్కటైన ఆ ముగ్గురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-176లో..  ధీరజ్, ప్రేమ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. తనేమో హోమ్ ట్యూషన్స్ చెప్తామంటే ధీరజ్ వద్దంటాడు. మరోవైపు ధీరజ్ అన్న మాటల్ని పెద్డోడు తల్చుకుంటాడు. వదిన అందర్నీ బాధపెట్టొచ్చు కానీ వదినకు మాత్రం ఎవరి వల్లా బాధపడకూడదు.. ఇదెక్కడి న్యాయం అన్నయ్యా అని అడిగిన మాట గట్టిగానే గుచ్చుకుంటుంది. ఇక సాగర్‌కి కూడా చందు అన్న మాటలు గుర్తొస్తాయి. ఇక ముగ్గురు అన్నదమ్ములు ఆలోచిస్తుంటారు. ఇక వేదవతి జరిగిందంతా రామరాజుకి చెప్పడంతో తనే ముగ్గరితో మాట్లాడటానికి పిలుస్తాడు. 

ప్రపంచం మర్చిపోయినా నేను మర్చిపోను.. థాంక్యూ శివయ్య

బుల్లితెర మీద అష్షు రెడ్డి ఒక హాట్ బాంబ్. ఆర్జీవి బ్యూటీ..జూనియర్ సమంత..పవన్ కళ్యాణ్ ఫ్యాన్..ఇలా ఆమె గురించి చాలా చెప్పుకోవచ్చు. ఐతే ఇదంతా జీవితంలో ఒక భాగం. అష్షు లైఫ్ లో మరో భాగాన్ని చూస్తే ఆమె ఒక ఫైటర్..జీవితాన్ని గెలిచిన అమ్మాయి. ఎందుకంటే ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని నుంచి కోలుకుని మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఒక్కసారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చాక ఆ జీవితం ఎప్పటికీ అలా గుర్తు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి తన బ్రెయిన్ సర్జరీ విషయం కూడా అంతే. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. "ప్రపంచం మర్చిపోవచ్చు..కానీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ జూన్ 4 వస్తే నాకు బ్రెయిన్ సర్జరీ జరిగి ఏడాది పూర్తయ్యింది.

పృద్వి - విష్ణు మధ్యకు శ్రీముఖి...మేమిద్దరి పార్టీకి వెళ్తే ఓకేనా

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో మొత్తం పార్టీ థీమ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. పార్టీ థీమ్ అనేసరికి ఎలా ఉంటుంది...ఫుల్ రంగు రంగుల కాస్ట్యూమ్స్ తో మంచి జోష్ తో వచ్చారు అంతా. శ్రీముఖి కూడా కిర్రాక్ కాస్ట్యూమ్ తో వచ్చింది. "పార్టీ ఉంటుంది పుష్ప" అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి. తేజస్విని మడివాడ ఐతే అచ్చం పార్టీ వేర్ వేసుకుని గాగుల్స్ పెట్టుకుని వచ్చేసరికి "పార్టీ మొత్తం నీలోనే కనిపిస్తోంది" అంటూ సెటైర్ వేసింది శ్రీముఖి. "పార్టీ అమ్మాయిలు చేసుకుంటే బాగుంటుందా అబ్బాయిలు చేసుకుంటే బాగుంటుందా" అని అడిగింది. "అమ్మాయిలు లేకుండా అబ్బాయిలకు పార్టీలో ఎంట్రీనే లేదు" అని చెప్పింది తేజు. "పార్టీలో కొంత మంది అబ్బాయిలు వుంటారు గ్లాస్ పట్టుకుని యు అని వచ్చేస్తారు..అక్కడ కూర్చున్న అమ్మాయిల్లో ఎవరిని చూస్తే యు" అని చెప్పాలని ఉంది అంటూ అమరదీప్ ని అడిగింది శ్రీముఖి. "అందరికీ చెప్పాలనిపిస్తుంది వాడికి" అంటూ వెనక నుంచి నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు.

సుధీర్ గారు ఎన్నాళ్ళు సింగల్ గా వుంటారు...

ఫ్యామిలీ స్టార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్ హీరోస్ వెర్సెస్ సీరియల్ హీరోయిన్స్ మధ్య పోటీ నిర్వహించాడు సుధీర్. ఈ షోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా ఐతే సుధీర్ ని ఒక రేంజ్ లో ఆడేసుకుంది. ఇప్పటి వరకు ఏ షోలో కూడా సుధీర్ తో అలా కామెడీ చేసిన వాళ్ళు లేరు. "మీ అందాన్ని నేను ఎంత బాగా వర్ణిస్తానో చూడండి. కాజు అంటే డ్రై ఫ్రూట్ సుధీర్ అంటే" అని చెప్పేసరికి సుధీర్ గట్టిగా అరుస్తూ ఆపేయ్ అన్నాడు. సుధీర్ తోనే కాదు రవికిరణ్ తో కూడా కామెడీ చేసింది దీపికా. "నాన్న నేనే టెక్సాస్ లో చదువుకుంటున్న మీ లిటిల్ ప్రిన్సెస్ ని" అనేసరికి రవి కిరణ్ షాకయ్యాడు. ఇక పవిత్ర వచ్చి మంచి సీరియల్ చేసానయ్యా అంటూ "చెడ్డీ చెరో సగం" అని చెప్పేసరికి అవాక్కయ్యాడు సుధీర్. తర్వాత "అబ్బని తియ్యని దెబ్బ" సాంగ్ కి దీపికా సుధీర్ తో కలిసి డాన్స్ చేసింది.

వాడు మగాడని తెలియాలిగా ముందు...

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి గెస్టులుగా నయని పావని, శ్వేతా నాయుడు వచ్చారు. "మమ్మల్ని గారు అనడానికి మేము ఇంకా 30s లోకి రాలేదు." అని చెప్పారు. ఇక హోస్ట్ ఐతే కొన్ని వర్డ్స్ ఇచ్చి స్టోరీ చెప్పమంది. ఐతే వాళ్ళు "6 ఇంచెస్, అబ్బాయి, నైస్ పెర్ఫ్యూమ్ స్మెల్ తో వచ్చాడు తర్వాత లేచి చూస్తే ఒక కల.." అంటూ చెప్పుకొచ్చారు. జీవితంలో ఒక డార్కెస్ట్ టైం ఏంటి అని అడిగేసరికి..."చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు...కానీ ఎవరూ ఆ టైములో నాకు సపోర్ట్ చేయలేదు. బాధగా అనిపిస్తే బాధపడు..ఆ పరిస్థితి నన్ను చాలా మార్చేసింది. నేను ఎవరినైనా హగ్ చేసుకోవడం మానేసాను.

Brahmamudi : రొమాంటిక్ గా రాజ్ దగ్గరికి వెళ్ళిన యామిని.. పాపం పట్టించుకోలేదుగా!

 స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -738 లో... యామినిని రాజ్ తీసుకొని రెసాట్ కి బయల్దేర్తాడు.ఈ రోజు కావ్యకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్ గిల్టీ నగలు తీసుకొని స్వప్నకి తెలియకుండా రూమ్ లో పెట్టాలనుకుంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. తను నగలు చూడకుండ కవర్ చేస్తాడు. ఎలాగైనా స్వప్న దగ్గర కీస్ తీసుకొని ఈ నగలు అందులో పెట్టాలనుకుంటాడు. రాహుల్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకోను.. కంపెనీకి ఓనర్ చెయ్యాలనుకుంటున్నా, ఈ టైమ్ లో ఏ తప్పు చెయ్యకని రాహుల్ కి వార్నింగ్ ఇస్తుంది.

 వీళ్ళు చెత్తవాళ్ళు అంటూ చీప్ గా తీసిపారేస్తారు..

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి హాస్య నటుడు ఆలీ వచ్చారు. అలాగే ఈ షో మెయిన్ థీమ్ గా జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల కష్టాలను చూపిస్తూ ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. వర్ష వచ్చి చెత్త తీసుకెళ్ళలేదేమిటి అంటూ ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని అడిగేసరికి "మా చేతిలో చెత్త బుట్ట పెట్టకుండా మేమేటి సేత్తాం " అంటూ డైలాగ్ వేసింది. ఇక నాటీ నరేష్ వచ్చి "ఆఫ్ట్రాల్ చెత్త ఎత్తుకునేవాడా" అని తిట్టేసరికి రాంప్రసాద్ పెద్ద డైలాగ్ చెప్పాడు. "ఆఫ్ట్రాల్ కాదు సర్. హైదరాబాద్ లో మొత్తం 30 జోన్లు ఉన్నాయి. మీకు జలుబు, జ్వరం వస్తే కనీసం గేట్ కూడా దాటరు. కానీ మేము  ఏ రోగం వచ్చినా కష్టపడతాం సర్." అని చెప్పాడు. తర్వాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికుల్ని తీసుకొచ్చి వాళ్ళ కష్టాలను విన్నారు.

Illu illalu pillalu : పదిలక్షల గురించి శ్రీవల్లి టెన్షన్.. నర్మద కనిపెట్టేనే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -174 లో.....నర్మద, ప్రేమ అక్కలు ఇద్దరు కలిసి నన్ను పది లక్షలు గురించి అడుగుతున్నారని  శ్రీవల్లితో బుజ్జి చెప్తుంది. దాంతో శ్రీవల్లి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటి మా చెల్లి ని బెదిరిస్తున్నారట ఎందుకని అడుగుతుంది. పది లక్షల గురించి టెన్షన్ పడుతున్నావ్ కదా ఏంటని అడిగానని నర్మద అనగానే నా గురించి నీకెందుకని శ్రీవల్లి అంటుంది. కదా అయితే ప్రతీదాంట్లో మా విషయాల్లో నువ్వు ఎందుకు దూరుతావని శ్రీవల్లిని నర్మద అడుగుతుంది.