English | Telugu

Illu illalu pillalu : ట్యూషన్ లో ప్రేమ.. భాగ్యం ప్లాన్ లో శ్రీవల్లి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -163 లో.....నర్మద ట్రైనింగ్ కి రెడీ అయి వెళ్తుంటే.. నేను కూడా నీతో వస్తాను.. నీ పక్కనే ఉంటానని సాగర్ అంటాడు. అంత లేదని నర్మద అంటుంది. అప్పుడే రామరాజు ఫోన్ చేసి అక్కడ పైసలు ఇచ్చేవాళ్ళున్నారు అంటూ అందరి అడ్రెస్ చెప్పి డబ్బు వసూల్ చేసుకొని రమ్మంటాడు. అదంతా పక్కన నుండి నర్మద విని కోపంగా.. నువ్వు ఇంతే అని వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ప్రేమ ట్యూషన్ చెప్తుంది. అప్పుడే శ్రీవల్లి వెళ్తుంది. అక్క నువ్వు ఆ పాపకి ఇంగ్లీష్ లో పోయెమ్ చెప్పమని ప్రేమ అంటుంది. దాంతో శ్రీవల్లి కంగారుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏంటి అక్క అంత చదువుకుంది అయిన అలా కంగారుపడుతుందని ప్రేమ ఆలోచనలో పడుతుంది. ప్రేమ ఇలా ఇరికిస్తుందని టెన్షన్ గా వాళ్ళ అమ్మ భాగ్యంకి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది. దాంతో భాగ్యం ఒక ప్లాన్ చెప్తుంది.

ఆ తర్వాత చందు,రామరాజులకి శ్రీవల్లి క్యారేజ్ తీసుకొని వెళ్తుంటే.. రెండు ఎందుకు అని వేదవతి అడుగుతుంది. అంటే మావయ్య గారికి అని శ్రీవల్లి చెప్తుంది. ఆయన ఇంటికి వచ్చి భోజనం చేస్తారని వేదవతి చెప్తుంది. అయినా వినిపించుకోకుండా శ్రీవల్లి వెళ్తుంది. ఈ పిల్ల ఏంటి అన్ని మారుస్తుందని వేదవతి కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత రైస్ మిల్ లో ఉన్న రామరాజు దగ్గరికి వెళ్లి బాక్స్ ఇస్తుంది. ఇలా కోడలు భోజనం తీసుకొని వచ్చిందని రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రైస్ మిల్ లో కస్టమర్స్ తో మాట్లాడుతుంటే.. పిల్ల తెలివైంది అని తిరుపతి, రామరాజు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.