Illu illalu pillalu: మామకు ఎదురుతిరిగిన కోడలు.. ప్రేమకు అత్త సపోర్ట్ చేయనుందా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu Pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-165లో.. ట్యూషన్ విషయంలో ప్రేమ, వేదవతిలు ఎన్ని విధాలుగా సర్దిచెప్పడానికి చూసినా రామరాజు వినిపించుకోడు. దాంతో ప్రేమ రివర్స్ అవుతుంది. మీకు చెప్పాలనే అనుకున్నాం.. ఇంతలో పిల్లలు వచ్చేయడంతో చెప్పడం కుదర్లేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అనగానే.. ఇది నీకు చిన్న విషయమే కావచ్చు కానీ.. ఇది నా ఇంటికి, గౌరవానికి మచ్చ తెచ్చే విషయమని రామరాజు అంటాడు. నేను ట్యూషన్ చెప్తే మీ పరువు పోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదని ప్రేమ అడుగుతుంది.