English | Telugu

బిగ్ బాస్ సీజన్ 9 కి ఛాన్స్ వస్తే వస్తావా ?

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో ప్రారంభం కాబోతోందన్న వార్త ఇప్పుడు బిగ్ బాస్ ఫాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఐతే ఓల్డ్ బిగ్ బాస్ సీజన్స్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ ఈ కొత్త సీజన్ లో చూడొచ్చా అని కూడా కొంతమంది ఫాన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్జె కాజల్ ని కూడా అలాగే అడిగారొక ఫ్యాన్. "బిగ్ బాస్ సీజన్ 9 మిమ్మల్ని చూడొచ్చా" అని.. దానికి కాజల్ తన ఆన్సర్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "జీవితంలో కొన్ని విషయాలు చాలా విలువైనవి..వాటిని ఒక్కసారి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. మనసుకు హత్తుకునే సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని అలాగే వదిలేయాలి కానీ వాటిని మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోకూడదు.

అది మీకైనా, నాకైనా, మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళకైనా. నేనొక బిగ్ బాస్ ఫ్యాన్ గా ఎం చెప్తాను అంటే రి-ఎంట్రీస్ అంటే నాకు ఇష్టం ఉండదు. దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టే నేను మళ్ళీ బిగ్ బాస్ లోకి రి-ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు. నా బిగ్ బాస్ సీజన్ 5 జర్నీ మాత్రం నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, మర్చిపోలేనిది, ఎమోషనల్ గా, నన్ను నన్నుగా అక్కడ ఆవిష్కరించుకున్న ఒక వాల్యుబుల్ జర్నీ. ఆ మెమోరీస్ ని అలాగే అపురూపంగా ఉంచుకోవాలని అనుకుంటున్నా కానీ రి-ఎంట్రీ ఇచ్చి వాటిని చెరుపుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అవి టచ్ చేయలేనివి, మార్పులు చేర్పులు చేయలేనివి కాబట్టి ఆ జర్నీ నా మనసుకు ఎంతో హత్తుకుపోయింది..కాబట్టి నేను నెక్స్ట్ సీజన్ లో కనించను" అంటూ ఒక లాంగ్ పోస్ట్ ని తన స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది కాజల్ ఆర్జే. మళ్ళీ ఆర్జేగా రావొచ్చు అని ఇంకో ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు..అస్సలు టైం సెట్ కావడం లేదు అందుకే రావడం లేదు అని చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.