English | Telugu

ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ కిస్సులు, హగ్గులు అంటూ సరదాగా నవ్వించాడు. రాంప్రసాద్, దొరబాబు, శాంతిస్వరూప్ కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ కుర్చీలో ఊగుతూ దొరబాబుతో వార్తలు చదివించుకుంటూ ఉంటాడు. అందులో హెడ్ లైన్ గా "కిస్సులకు, హగ్గులకు ఒకే అన్న రష్మీ" అని చదువుతాడు. ఎవరైనా ఆ మాట వింటే సీరియస్ అవుతారు. కానీ రష్మీ మాత్రం సింపుల్ గా నవ్వుతూ "ఇది ఎప్పుడో అన్నాను నేను" అనేసరికి రాంప్రసాద్, దొరబాబు షాకై చూస్తూ ఉంటారు. "నీకు అభ్యంతరం లేకపోతే చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం..ఈ వయసులో కిస్సులు, హగ్గులు బాగోవు కదా" అన్నాడు రాంప్రసాద్..ఆ మాటకు రష్మీ షాకయ్యింది.

అమరదీప్-తేజస్విని ఫ్యూచర్ ఏఐ రూపంలో ఇలా...

అమరదీప్ - తేజస్విని గౌడ బుల్లి తెర మీద సీరియల్స్ ద్వారా షోస్, ఈవెంట్స్ ద్వారా ఆడియన్స్ పరిచయమే. అలాంటి తేజు రీసెంట్ గా కాకమ్మ కథలు షోకి గెస్ట్ గా వచ్చింది. అందులో ఆమె ఎన్నో విషయాలను చెప్పింది. "నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక అనుకోకుండా నేను ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లు అయ్యింది. నిజంగా నేను చాలా లక్కీ నా గ్రాఫ్ ఇండస్ట్రీలో అలానే వెళ్తోంది. కోయిలమ్మ సీరియల్ టైములో నేను అమర్ ని కలిసాను. అప్పుడు అమర్ నాతో మాట్లాడాడు..నన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం, చాట్ చేయడం చేసేవాడు. మే బి ట్రై చేసాడేమో అప్పుడే...నేను అప్పుడే అనుకున్నాను కానీ పడలేదు నువ్వు అంటుంటాడు.

Illu illalu pillalu : భాగ్యం చేసిన మోసం భయటపడుతుందా.. టెన్షన్ లో శ్రీవల్లి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -172 లో.... ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే ప్రేమ వచ్చి.. విశ్వ ఫ్రెండ్స్ కి బుద్ది చెప్తుంది. దాంతో వాళ్ళు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. చిన్న ఎర్రమిరపకాయలాగా ఉంది అందరిని భయపెట్టిందని ధీరజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ ఇద్దరు కాలేజీకి వస్తారు. ఎందుకు వాళ్ళని అలా అన్నావని ధీరజ్ అడుగుతాడు. నిన్ను అలా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. నేను ఎలా ఉరుకుంటానని ప్రేమ అంటుంది. నన్ను అంటే నీకేంటి అని ధీరజ్ అడుగుతాడు. నాకేం ప్రేమ అంటుంది.

ఫంక్షన్స్ లో దొంగతనంగా వెళ్లి తినేవాళ్ళం...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో రాబోయే వారం షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానవు. ఈ న్యూ ఎపిసోడ్ ని ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది. దాంతో ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు. ఇక శేఖర్ మాష్టర్ కోసం కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు సత్య మాష్టర్. ఇద్దరి మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ ఎలా ఫార్మ్ అయ్యింది అని శ్రీముఖి అడిగేసరికి "ఉదయం 5 గంటలకే లేచేవాళ్ళం. రాత్రి వరకు మాకు డాన్స్ మాత్రమే ప్రపంచం అంతకు మించి మాకు ఇంకేం తెలీదు. మాకు ఆ టైములో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఐదేళ్లు అలా ఉన్నాం. దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళేవాళ్ళం.. అక్కడే ఎక్కువగా తినేవాళ్ళం.