English | Telugu

Brahmamudi : రొమాంటిక్ గా రాజ్ దగ్గరికి వెళ్ళిన యామిని.. పాపం పట్టించుకోలేదుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -738 లో... యామినిని రాజ్ తీసుకొని రెసాట్ కి బయల్దేర్తాడు.ఈ రోజు కావ్యకి ఎలాగైనా నా మనసులో మాట చెప్పాలని రాజ్ అనుకుంటాడు. మరొకవైపు రాహుల్ గిల్టీ నగలు తీసుకొని స్వప్నకి తెలియకుండా రూమ్ లో పెట్టాలనుకుంటాడు. అప్పుడే స్వప్న వస్తుంది. తను నగలు చూడకుండ కవర్ చేస్తాడు. ఎలాగైనా స్వప్న దగ్గర కీస్ తీసుకొని ఈ నగలు అందులో పెట్టాలనుకుంటాడు. రాహుల్ దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు ఏదైనా తప్పు చేస్తే మాత్రం ఊరుకోను.. కంపెనీకి ఓనర్ చెయ్యాలనుకుంటున్నా, ఈ టైమ్ లో ఏ తప్పు చెయ్యకని రాహుల్ కి వార్నింగ్ ఇస్తుంది.

రాజ్ , యామిని గదిలోకి వెళ్తారు. అక్కడ వెయిటర్ రాజ్ కి చిరాకు తెప్పిస్తాడు. రాజ్ బెడ్ పై కూర్చొని ఉంటాడు. రాజ్ దగ్గరగా యామిని వెళ్లి తనపై చెయ్ వేస్తుంది. ఏంటి బావ నాపై రొమాంటిక్ ఫీల్ వస్తుందా అంటుంది. అదేం లేదని రాజ్ అంటాడు. పర్లేదు బావ మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. పైగా మా అమ్మనాన్న మనల్ని పంపించారని యామిని అంటుంది. అయితే నమ్మకంగా పంపించారు అలాగే ఉండాలని రాజ్ అంటాడు. అప్పుడే కావ్య రావడం కిటికీ లో నుండి చూసి మా ఫ్రెండ్ వచ్చిందంటూ యామిని దగ్గర నుండి రాజ్ వెళ్ళిపోతాడు. కావ్య రూమ్ కీస్ తీసుకొని వెళ్తుంటే రాజ్ ఎదురుపడి మీరు ఇక్కడికి వచ్చారా అంటూ తెలియనట్లు అడుగుతాడు. ఆ తర్వాత ఎక్కడ యామిని చూస్తుందోనని రాజ్ త్వరగా కావ్యని తీసుకొని గదిలోకి వెళ్తాడు

మరొకవైపు అప్పు క్యారేజ్ ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి ఒక ముడు రోజులు అయినా ఇంట్లో ఉండకుండా మళ్ళీ డ్యూటీ కి వెళ్తున్నావా అని కోప్పడుతుంది. లేదు తను లీవ్ పెట్టిందని కళ్యాణ్ అంటాడు. మరి ఎందుకు క్యారేజ్ పెడుతుందని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నాకు వంట రాదు కదా ప్రాక్టీస్ చేస్తున్నానని అప్పు చెప్తుంది.ఆ తర్వాత కావ్య గదిలో రాజ్ ఉండడం వెయిటర్ చూసి ఇక్కడ ఉన్నారేంటని రాజ్ అడుగుతాడు. తరువాయి భాగం లో రెసాట్ లో కావ్యని చూసి యామిని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.