English | Telugu

Illu illalu pillalu:  గుండెల్ని పిండేసిన అన్నదమ్ముల అనుబంధం.. ఒక్కటైన ఆ ముగ్గురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-176లో.. ధీరజ్, ప్రేమ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటారు. తనేమో హోమ్ ట్యూషన్స్ చెప్తామంటే ధీరజ్ వద్దంటాడు. మరోవైపు ధీరజ్ అన్న మాటల్ని పెద్డోడు తల్చుకుంటాడు. వదిన అందర్నీ బాధపెట్టొచ్చు కానీ వదినకు మాత్రం ఎవరి వల్లా బాధపడకూడదు.. ఇదెక్కడి న్యాయం అన్నయ్యా అని అడిగిన మాట గట్టిగానే గుచ్చుకుంటుంది. ఇక సాగర్‌కి కూడా చందు అన్న మాటలు గుర్తొస్తాయి. ఇక ముగ్గురు అన్నదమ్ములు ఆలోచిస్తుంటారు. ఇక వేదవతి జరిగిందంతా రామరాజుకి చెప్పడంతో తనే ముగ్గరితో మాట్లాడటానికి పిలుస్తాడు.

అమ్మ చెప్పినట్టు అందరం కలిసి అన్నవరం వెళ్దామని రామరాజు చెప్పినా.. ఎవరు సరిగ్గా స్పందించారు. అన్నవరం అంటే ఆ స్వామివారితో పాటు.. వెంటనే గుర్తొచ్చేది మీ ముగ్గురేరా అని రామరాజు అంటాడు. వెంటనే మేం ముగ్గురం గుర్తుకురావడం ఏంటి నాన్నా అని పెద్దోడు అడుగుతాడు. మీరు బాగా చిన్నగా ఉన్నప్పుడు అన్నవరం వెళ్తే.. మీ అన్నదమ్ముల మధ్య ఎంత బలమైన బంధం ఉందో చెప్పడానికి అక్కడో సంఘటన జరిగింది. మీరెవరూ తప్పిపోకూడదని.. మీ ముగ్గుర్నీ ఒకరి చేయి ఒకర్ని పట్టుకోమని చెప్పానురా.. అక్కడ పట్టుకున్న చేతులు ఇంటికి వచ్చేవరకూ వదిలిపెట్టలేదు. నాకు ఆ క్షణమే అనిపించిందిరా.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఎంత కష్టం వచ్చినా కూడా.. నా ముగ్గురు కొడుకులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉంటారే తప్ప.. ఆ చేతుల్ని విడిచిపెట్టను. వాళ్ల మధ్య దూరం పెరగదని.. నా నమ్మకాన్ని మీరిప్పటి వరకూ నిజం చేస్తూ నన్ను గెలిపిస్తూనే ఉన్నారు. అనాధనైన నేను మీ అమ్మని పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించిన తరువాత.. నన్ను అర్థం చేసుకునే భార్య ఉందని ఆనందం ఉన్నాసరే.. భుజాన్ని భరోసాగా ఇచ్చే ధైర్యం లేదే అని దిగులు ఉండేది. కానీ.. నా ముగ్గురు కొడుకుల రూపంలో ఆ ధైర్యం నాకు వచ్చేసింద్రా. నా ముగ్గురు కొడుకులు నా భుజం తట్టి భరోసా ఇవ్వడమే కాదు.. వాళ్లే నా భుజాలయ్యారు. ఎవరైనా ఎప్పుడైనా.. రామరాజూ నువ్వేం సంపాదించావయ్యా అని ఎవరైనా అడిగితే.. వజ్రాల్లాంటి ముగ్గురు కొడుకుల్ని సంపాదించాను అని గర్వంగా చెప్తానురా. అందరూ కొడుకులంటే వారసత్వం అని చెప్తారు. నేను మాత్రం నా కొడుకులే నా ధైర్యం.. నా బలం అని చెప్తానురా అంటూ రామరాజు ఎమోషనల్‌గా మాట్లాడతాడు.

ఇక అలా రామరాజు ఎమోషనల్ అవ్వగానే తన ముగ్గురు కొడుకులు కూడా భావోద్వేగానికి గురవుతారు. ఇక ఒకరి జాబ్ గురించి మరొకరు అడుగుతూ మాటలు కలుపుతారు. ఆ తర్వాత ముగ్గురు ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటారు. ఇది హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. వాళ్లని వేదవతి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మీరు ముగ్గురు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని వేదవతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.