Brahmamudi : రౌడీకి కోటి రూపాయలు ఇచ్చిన యామిని.. వాళ్ళిద్దరు చూసేసారుగా!
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -751 లో.....రాజ్, యామినీల పెళ్లిలో భాగంగా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. రాజ్ నువ్వు వచ్చి యామినికి మెహందీ పెట్టమని వైదేహి అంటుంది. దాంతో రాజ్ కాస్త ఇబ్బందిగానే యామిని పక్కన వచ్చి కూర్చుంటాడు. రాజ్ యామినికి మెహందీ పెట్టడం ఆపాలని అప్పు, కళ్యాణ్ ప్లాన్ చేసి కావ్యపై ఎటాక్ చేసిన రౌడీతో యామినికి ఫోన్ చేయిస్తారు.