English | Telugu

అసలు యాక్టింగ్ వచ్చా నీకు..రోహిణి ఫాదర్ ఫైర్

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఇందులో రోహిణి వాళ్ళ నాన్న సింహాద్రి ఈ షోకి వచ్చారు. శ్రీముఖి ఐతే రోహిణి వాళ్ళ నాన్నతో డాన్స్ లు చేయించింది, తొడ కొట్టించింది. "మొదటి సారి ఫ్లయిట్ ఎక్కి మరీ షూటింగ్ కి వచ్చారు. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్" అని అడిగింది శ్రీముఖి. "ఆర్టిస్టులకు కూడా కార్ పెడతాం ఫ్లయిట్ పెడతాం అనే మర్యాదలు జరగవు కానీ ఈయన ఎక్కడో ఉన్నారు. రండి రండి ప్లీజ్ మీకు ఫ్లయిట్ పెడతాం అని రప్పించారు..మీరు నమ్మరు కానీ ఉదయాన్నే షూటింగ్ కి వెళ్తున్నాను అంటే మా నాన్న లేచి జ్యూస్ లు ఏమన్నా తినడానికి బాక్స్ లు రెడీ చేసి మా అమ్మా నాన్న రెడీ చేస్తారు.

మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం

బుల్లితెర మీద శివ్ కుమార్ - ప్రియాంక జైన్ ఇద్దరూ ఇంతమంచి స్నేహితులో అందరికీ తెలుసు. అలాంటి శివ్ పుట్టినరోజును పరి స్పెషల్ గా ప్లాన్ చేసింది. అలాగే ఇంకో సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. శివ్ ని అండమాన్ తీసుకెళ్లింది పరి. శివ్ ఐతే చాలా ఎక్సయిట్ అయ్యాడు. అలాగే అతనికోసం ఒక రింగ్ కూడా కొన్నది పరి. 2025 జూన్ లో టేకాఫ్ అయ్యాం అదే 2050 ఇయర్ లో ల్యాండ్ ఐతే ఎలా ఉంటుంది అంటూ వింతైన ప్రశ్న అడిగింది పరి. చాలా బాగుంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు శివ్. సముద్రం మీద ఫ్లయిట్ లో వెళ్తూ డ్రై ఫ్రూప్ట్స్ తో తయారు చేసిన కేక్ ని ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి శివ్ కట్ చేసి టేస్ట్ చేసాడు. అలాగే క్రోజ్ లో హావలోక్ అనే ఐలాండ్ కి తీసుకెళ్లి అక్కడ 150 ఏళ్ళ వయసున్న పెద్ద వృక్షాన్ని చూపించింది. ఇక అక్కడ ఒక పెద్ద సెటప్ వేయించింది.

Karthika Deepam2 : మల్లెపూలతో బావ అని రాసిన దీప.. మురిసిపోయిన కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -383 లో.....పారిజాతం కేక్ కింద పడేసిన వీడియో జ్యోత్స్నకి చూపించి కార్తీక్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న ని కిందకి రప్పించి.. కేక్ ఆర్డర్ చేస్తాడు. కేక్ పై దీప, జ్యోత్స్న అని రాసి ఉంటుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ పేర్లు జ్యోత్స్న పెట్టమందని కార్తీక్ అనగానే అవునని జ్యోత్స్న చెప్తుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి కేక్ కట్ చేస్తామని చెప్పమని జ్యోత్స్నకి కార్తీక్ సైగ చెయ్యగా.. మేమ్ ఇద్దరం కేక్ కట్ చేస్తామని జ్యోత్స్న  అంటుంది. 

ఒక లవ్ కోసం...ఈవిడ ఒకడి తోటి ఎఫైర్...

కాకమ్మ కథలు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ న్యూ ఎపిసోడ్ కి మానస్, సత్య వచ్చారు.  "అసలు మీరిద్దరూ ఎలా కలుసుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది " అంటూ తేజస్విని అడిగింది. "ఒక గొడవ వలన కలిసాం..నువ్వెందుకు వాళ్ళను సపోర్ట్ చేసావ్ అంటూ నన్ను అడిగింది  " అని చెప్పాడు మానస్. "వాళ్లంటే ఎవరు" అని అడిగింది తేజు. "పేర్లెందుకులే" అంది సత్య. "ఐతే ఎవరో ఒక కాకి" అంది తేజు. ఇక తర్వాత మానస్ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. "10 త్ లో 93 , ఇంటర్ లో 98 పర్సెంట్ మార్క్స్ వచ్చాయి. నాకు హీరో అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా 13 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయ్యింది. ఆ సినిమాకు నంది అవార్డు వచ్చింది.