English | Telugu

రేవతిగారితో నటించిన మూవీ రిలీజ్ కాలేదు.. 

సిల్వర్ స్క్రీన్ మీద రాజా రవీంద్ర ఎన్నో మూవీస్ లో ఎన్నో రోల్స్ లో నటించాడు. ఆయన జర్నీ చాలా సుదీర్ఘమైనది. ఇప్పటికీ ఎన్నో మూవీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా అయన కాకమ్మ కథలో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. "నేను కూచిపూడి డాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చాను. నేను మెస్ లో భోజనం చేస్తున్నప్పుడు ఒకాయన వచ్చి ఇలా రేవతి గారితో ఒక మూవీ చేస్తున్నారు. హీరో కోసం వెతుకుతున్నారు. మీరు చేస్తారా అని అడిగారు. నేను హీరో ఏంటి అనేసరికి లేడు రండి అని నన్ను తీసుకెళ్లారు. మేము వెళ్లేసరికి డైరెక్టర్ గారు. అప్పట్లో నా అసలు పేరు రమేష్. నేను విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను. అప్పట్లో ల్యాండ్ ఫోన్ ఉంది. రెండో రోజు ఫోన్ చేసి పిలిస్తే వెళ్లాను. చూసి ఎవడ్రా నువ్వు అన్నారు. సాంబశివరావు అని ఈనాడు అవి తీశారు కృష్ణ గారితో. నేనే సర్ రమేష్ ని అన్న. ఓరిని రమేష్ అరవింద్ అనుకున్న రమేషా నువ్వు అన్నారు. సరే బానే ఉన్నావ్ గాని రా అని రేవతి గారి దగ్గరకు తీసుకెళ్లారు. హీరోగా వీడు ఓకేనా అని అడిగారు. అప్పటికే ఆవిడ నేషనల్ అవార్డు అందుకున్న పెద్ద ఆర్టిస్ట్.

"ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా"

సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ ఐతే అవసరమైనప్పుడల్లా ప్రాపెర్టీస్ తెచ్చే అమ్మాయి లస్సి మీద ఫుల్ జోకులు వేసాడు. లస్సి స్టేజి మీదకు వచ్చేసరికి "పెరుగు ఎవరు తోడెట్టారో కానీ లస్సి అద్దిరిపోయింది" అని జోక్ వేసాడు. సుధీర్ ఐతే "ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా" అన్నాడు. "నాకు ఒక స్ట్రా తెస్తావా లస్సి" అని అడిగాడు మళ్ళీ రాంప్రసాద్. లస్సి చేతిలో ఒక ప్రాపర్టీ ఉంది. "అరేయ్ సుధీర్ లస్సిని పట్టుకురమ్మను. ఇంతదూరం వచ్చింది నిన్ను చూడడానికి కాదు. లస్సి ఇటురా" అని పిలిచాడు రాంప్రసాద్.

Illu illalu pillalu : ఆనందరావు ఇడ్లీల బిజినెస్ చెప్పేసిన నర్మద,ప్రేమ.. షాక్ లో శ్రీవల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -202 లో... శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ పై ఇడ్లీలు అమ్ముతుంటే నర్మద, ప్రేమ ఇద్దరు వెళ్లి అతన్ని చూస్తారు. అతను ఈ ఇద్దరిని చూడగానే షాక్ అవుతాడు. వెంటనే త్వరగా డైవర్ట్ చేస్తాడు. ఇలా ఇడ్లీలు అమ్ముకోవాలని అంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లి సూట్ వేసుకుంటాడు. ఏంటి బాబాయ్ ఇలా ఇడ్లీ అమ్ముతున్నారని ప్రేమ, నర్మద అడుగుతారు. అదేం లేదమ్మా నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను కదా.. అలాగే ఎలా బిజినెస్ చెయ్యాలో కూడా నేర్పిస్తానని కవర్ చేస్తాడు.

Brahmamudi : నగలు దొంగతనం చేసింది రాహుల్.. అప్పు, స్వప్నల ఇన్వెస్టిగేషన్ షురూ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -765 లో.... రాజ్ కి బాస్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది కావ్య. అందరిలో ఆఫీస్ లో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. ఇలా ప్రతీది ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. అదంతా రుద్రాణి చూసి యామినికి ఫోన్ చేసి చెప్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రాజ్ ఆఫీస్ కి రాకుండా చేయమని యామినికి చెప్తుంది రుద్రాణి. మరొకవైపు స్వప్న దగ్గరికి అప్పు వస్తుంది. అక్క నీకు ఎలా కనిపిస్తున్నాను.. గిల్టీ నగలు ఇచ్చి నన్ను మెరుగు పెట్టించమని ఇచ్చావని అప్పు అనగానే స్వప్న షాక్ అవుతుంది.

హరి నువ్వు రాసుకుంటేనే నీకు పంచులు వస్తాయి

కూకు విత్ జాతిరత్నాలు షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే అది ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఈ షోకి హరి, ఇమ్మానుయేల్, బాబా భాస్కర్, సుహాసిని, రీతూ వచ్చారు. హరి మెడలో ఉన్న విజిల్ చూసిన ప్రదీప్ "ఏంటి నువ్వు మెడలో విజిల్ వేసుకొచ్చావ్" అని అడిగాడు. దానికి ఇమ్ము ఆన్సర్ ఇచ్చాడు. "పొద్దున్నే మనోడు ఇదే పనికి వెళ్తూ ఉంటాడు. విజిల్ వేయగానే తడి చెత్త, పొడి చెత్త తీసుకొస్తారు" అని కౌంటర్ వేసాడు ఇమ్ము. ఇక ఈ షోకి తమ్ముడు మూవీ నుంచి ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ లయ కూడా ఈ షోకి వచ్చింది. అలాగే దిల్ రాజు కూడా వచ్చారు. "దిల్ రాజు గారు మీరు ఏ ఫుడ్ ఇష్టం" అంటూ రాధ అడిగారు. "ఫేవరేట్ ఫుడ్ అంటే నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం" అని చెప్పారు.

ఓదెల 2 లో తమన్నాలా ఉన్నావ్...మంచిగున్నావ్ లేడి అఘోరాలా

విరూపాక్ష మూవీలో కనిపించేది చిన్న రోల్ లో ఐనా కానీ ప్రతీ ఒక్కరి మనస్సులో మంచి స్థానం సంపాదించుకుంది సోనియా సింగ్. బుల్లితెర మీద సోనియా సింగ్ - పవన్ సిద్దు జోడి చాలా షోస్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటారు. రీసెంట్ గా సోనియా కాశీ వెళ్ళింది. శివుని భక్తిలో మునిగి తేలుతోంది. దానికి సంబంధించిన పిక్స్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. "శివుడిని పట్టుకునేది నేను కాదు... నన్ను ఎప్పుడూ వదలనిది శివుడే." అంటూ కాప్షన్ పెట్టుకుంది. నెటిజన్స్ ఐతే సోనియా పిక్స్ కి కామెంట్స్ పెడుతున్నారు. "హర్ హర్ మహాదేవ..కాశీ వెళ్ళావా సిస్టర్. ఉన్న అఘోరాలు చాలు బాబోయ్. బాబు సిద్దు ఎక్కడున్నావ్ కొంచెం సూడు నాయనా.. అలా వదిలేయకు సోనిని.

Illu illalu pillalu : ఇడ్లీలు అమ్ముతూ కన్పించిన శ్రీవల్లి నాన్న.. మరి ఆ పది లక్షలు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -201 లో... ధీరజ్ ని తీసుకొని ప్రేమ గుడికి వస్తుంది. అక్కడ పంతులు మంచిమాటలు చెప్తుంటే.. ప్రేమ వింటూ ఉంటుంది. నేను ఎలాగైనా.. ఎవరు ఏమన్నా కూడా ధీరజ్ కి సాయంగా ఉండాలని ప్రేమ అనుకుంటుంది. ధీరజ్ దగ్గరికి వెళ్లి రెండు వేల్లు చూపించి ఒక వేలిని పట్టుకోమంటుంది. ధీరజ్ పట్టుకుంటుంటాడు.. థాంక్స్ రా అని ప్రేమ అనగానే ఇదివరకు ఇలాగే చేసి ఇంట్లో గొడవకి కారణం అయ్యావ్.. ఇప్పుడు ఏం చేస్తున్నావని ధీరజ్ అనగానే ఏం లేదని ప్రేమ అంటుంది.

సిద్దార్థ్ కి ఎన్ని కష్టాలో...

​కూకు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి గెస్ట్ గా సిద్దార్థ్ వచ్చాడు. ఇక రాగానే "అదిరే అదిరే" సాంగ్ ని ప్లే చేయడంతో సిద్దార్థ్ కూడా మంచి జోష్ తో డాన్స్ చేసాడు. తర్వాత హోస్ట్ ప్రదీప్ అడిగాడు "మీకు వంటొచ్చు కదా" అని. "నేను రెగ్యులర్ కుక్ ని ఇక ఇప్పుడు పెళ్లయింది కదా ఇంకా రెగ్యులర్ కుక్ ని ఐపోయాను" అని చెప్పాడు సిద్దార్థ్. దాంతో అందరూ నవ్వేశారు. వెంటనే రాధ "సిద్దార్థ్ నేను అదితిది ఒక వీడియో చూసాను. మూన్ మూన్ మూన్ కా కట్ చేసి అంటూ భలే క్యూట్ గా చెప్తోంది కదా" అని అంది. దానికి సిద్ధార్థ్ " ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు మీరు మూన్ మూన్ మూన్ షేప్ లా కట్ చేయాలి అని చెప్తుంది. ఏంటా షేప్ అంటే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఆ షేప్ మూన్ లా ఉండాలట" అని చెప్పాడు. దానికి ప్రదీప్ "ఇంకా నయం ఆ రోజు అమావాస్య ఐతే ఎం కట్ చేయాలో తెలీదు" అని కామెడీ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.

సీరియల్స్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఆది

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయింది. "ఈ ఇంట వేడుక" పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది.  అందులో ఆది కోరికలు మాములుగా లేవు. సీరియల్ హీరోగా చేద్దామనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ షోకి సీరియల్స్ వాళ్ళను పిలిచారు. అందుకే పార్టీ అని చెప్పి సీరియల్స్ వాళ్ళను పిలిచి వాళ్ళ నుంచి ఎమోషన్స్ లాగేసి సీరియల్ హీరో ఐపోతా అని ప్లాన్ చేసుకున్నాడు. "వేయి శుభములు కలుగు నీకు, వసుంధర, మెరుపు కలలు, సంధ్య రాగం, అందాల రాక్షసి, జీవన తరంగాలు, ఆరో ప్రాణం" వంటి సీరియల్స్ వాళ్లంతా వచ్చారు. ఇక ఈ షోకి సీరియల్ సీనియర్ యాక్టర్ యమునా వచ్చింది. ఐతే రష్మీ ఆమె ఇలా చెప్పింది.