సుధీర్ కి ప్రపోజ్ చేసింది...రష్మీనా?
సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి ముందుగా శివ్ కుమార్, ప్రియాంక జైన్ వచ్చారు. రాగానే ప్రేమలో మునిగి తేలిపోయారు. వీళ్ళు ఎక్కడికి వచ్చి ప్రేమ, ప్రేమ మాటలు, ప్రేమ గులాబీలు ఇవి తప్ప ఇంకో మాట ఉండదు. "ఓ ప్రియా ప్రియా" అనే సాంగ్ కి వీళ్ళు డాన్స్ చేస్తూ వచ్చారు. ఇక షో అన్న విషయం మర్చిపోయి ప్రేమలో డాన్సుల్లో మునిగి తేలుతున్న వీళ్లకు బ్రేక్ వేస్తూ సుధీర్ వచ్చి ఒక గులాబీ పువ్వు ఇచ్చాడు. ఇక ఆ గులాబీని శివ్ ప్రియాంకకు ఇచ్చి చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక వాళ్ళు ప్రేమలో మునిగితేలుతున్న టైంలో సుధీర్ అబ్బా అనుకున్నాడు. "కెమిస్ట్రీ అనేది నాకు అర్ధం కావట్లేదు" అని సుధీర్ శివ్ ని అడిగాడు.