English | Telugu

Brahmamudi : ప్రాణాపాయ స్థితిలో స్వప్న.. కావ్య ప్లాన్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -757 లో..... యామిని తన ప్లాన్ ఏంటో క్లియర్ గా కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో కావ్య షాక్ అవుతుంది. వెంటనే కిందకి వెళ్లి అక్క ఎక్కడ అని అడుగుతుంది. పాప ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది టీకా కోసమని రుద్రాణి అనగానే కనీసం మీకు తోడు వెళ్లాలన్నా బుద్ది కూడా లేదా అని వాళ్లని తిడుతుంది కావ్య. అప్పుడే హల్లో ఉన్న వాళ్ళందరూ ఏమైందని కావ్యని అడుగుతారు. అక్క గురించి చెప్తే అందరు కంగారు పడుతారని ఏం లేదని కావ్య అంటుంది. కావ్య వెళ్తుంటే అప్పుడే రాజ్ వస్తాడు. మీతో మాట్లాడాలి కళావతి గారు అని రాజ్ అనగానే.. నేను బయటకు వెళ్ళాలి ప్లీజ్ ఏమనుకోకండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి వస్తానంటూ కావ్య బయటకు వెళ్తుంది.

రాధ ఎవరనుకున్నావ్ కోహినూర్ వజ్రం.. 

"కుక్కు విత్ జాతి రత్నాలు" షో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, మూవీస్ లో విలన్ రోల్స్ లో కనిపించే ఆశిష్ విద్యార్థి, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ ఉండబోతున్నారు. ఇక షోలో వంటలు చేసి అలరించడానికి ఈటీవీ నటుడు ప్రభాకర్, ప్రియా, యష్మి, బాబా భాస్కర్, సుజిత, సుహాసిని, విజె సున్ని, అవినాష్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బాలు అలియాస్ విషుకాంత్ వంటి వాళ్లంతా రాబోతున్నారు. ఐతే రోజూ ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది స్టార్ మా. రీసెంట్ గా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. రాధ సిగ్గు పడుతూ కూర్చుంటే ఆశిష్ విద్యార్థి డైలాగ్ వేశారు. "ప్రదీప్ ఎవరయ్యా చెప్పింది బ్రిటీషర్ లు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారని ..చూడు మన పక్కనే కూర్చుంది" అన్నారు.

మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని రాశారు దానికి బాధపడ్డా..జర్నలిస్టుల గొంతు నొక్కేస్తారా

ఫ్యామిలీ స్టార్ షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే ఈ షో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఈ షోకి వీడియొ జాకీస్ వెర్సెస్ ఆడియో జాకీస్ విజెస్ వెర్సెస్ ఆర్జెస్ గా డిజైన్ చేశారు. ఇందులోకి దీప్తి నల్లమోతు, జాఫర్, శివజ్యోతి, వింధ్య విశాఖ, ఆర్జే సూర్య, చైతు,  వంటి వాళ్లంతా వచ్చారు. ఐతే జాఫర్ ఎక్కడ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా సుధీర్ ని ఇంటర్వ్యూ చేసాడు. "ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి కదా.. బాగా బాధపెట్టిన రూమర్ ఏంటి" అని అడిగాడు. "ఇంట్లో వాళ్ళు చనిపోయారని ఏదో న్యూస్ రాశారు. మా డాడీకి ఫోన్స్ చేసి అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు బతికుండగానే లేరు అని రాయడం" చాలా బాధపెటింది అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు సుధీర్.

Illu illalu pillalu :  నిజాలు చెప్పిన నర్మద వాళ్ళ నాన్న.. షాకైన ఇన్విజిలేటర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -193 లో.... సాగర్, నర్మద కలిసి నర్మద వాళ్ళింటికి వెళ్తారు. నర్మద వాళ్ళ నాన్నకి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి‌ బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటుంది. అయితే నర్మద ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోతుంటాడు. లేచిపోయి‌ ఇప్పుడు వచ్చి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తే అన్నీ మర్చిపోతాననుకుంటున్నావా అంటూ నర్మదని కోప్పడతాడు వాళ్ళ నాన్న. నీ అప్పుడు ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే రైస్ మిల్ లో మూటలు మోస్తాడని చెప్పాలా.. మీ ఆఫీస్ లో నీ భర్త ఏం  చేస్తాడంటే ఏం సమాధనం చెప్తావని వాళ్ళ నాన్న నర్మదని నిలదీస్తాడు. తను మౌనంగా ఉండిపోతుంది. ఇక కాసేపటికి నర్మద, సాగర్ ఇద్దరూ ఒకచోటకి చేరుకుంటారు. తన నాన్న అన్న మాటలకి నర్మద కన్నీటి పర్యంతం అవుతుంది. సాగర్ ఓదారుస్తుంటాడు. 

ఆది నువ్వు ఇంతవరకు చేసిందంతా బొక్క...రెజీనా బిజీనా

ఢీ - 20 ఇది సర్ మా బ్రాండ్ న్యూ సీజన్ లాంఛ్ కి సిద్దమయ్యింది. ఇక ఆది ఎంట్రీ ఊరమాస్ డైలాగ్స్ తో అదిరిపోయింది.  "ఆది గాడు బయటకు వస్తే చాలు సర్. సందుల్లో, పార్కుల్లో, రెస్టారెంటుల్లో ఎక్కడ పడితే అక్కడ అనుమానంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తున్నా సర్ నేను. అరె ఇదే ఢీ షోలో కంటెస్టెంట్స్ బాగా చేస్తే దగ్గరకు పిలిచి బుగ్గలు కొరికిన పూర్ణని చూసి మనం ఎం నేర్చుకున్నాం..హగ్గులిచ్చే ప్రియమణిని చూసి మనం ఎం నేర్చుకున్నాం ..మారాలి సర్ ఈ పద్దతి మారాలి..మార్పంటే అమ్మ ఏదో ఆకాశం నుంచి ఊడిపడక్కర్లేదు..ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి సర్..రెజీనా బిజీనా" అని అనేసరికి రెజీనా షాకైపోయింది. ఇక ఈ షోలోకి సౌమ్య ఎంట్రీ ఇచ్చింది. "షోకి చాల అందం పెరగాలని నన్ను పెట్టేసారు. షో కొంచెం హాట్ లో ఉండాలని నందుని పెట్టారు.

నా కామెడీ గురించి అడగడానికి మీరంతా ఎవరు ?

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం శనివారం ఎపిసోడ్ లో ఇమ్మానుయేల్ బాగా ఏడ్చేశాడు. ఐతే శ్రీముఖి సాకేత్ కి ఇమ్ముకి ఒక టాస్క్ ఇచ్చింది. సాకేత్ శ్రీముఖిలా చేసాడు. ఇమ్ము ఖిలాడీ గర్ల్స్ ని ఇమిటేట్ చేసాడు. ఐతే ఇమ్ము రోహిణి అదే పనిగా తింటున్నట్టుగా నటించాడు. ఇంతలో సాకేత్ "రోహిణి మెమరీ టాస్క్ లో మీ సైడ్ నుంచి ఎవరొస్తున్నారు" అని గట్టిగ అడిగేసరికి "ఎవరికీ మెమరీ లేదు ఎవరూ రారు..ఐనా మెమరీ మీలో ఎవరికీ లేదేంటి " అనేశాడు ఇమ్ము. దాంతో రోహిణి లైన్ లోకి వచ్చి "చేస్తే నా గురించి చెయ్యి..ఓవర్ యాక్షన్ చెయ్యి ఇలాంటివి చేయకు అంటూ" కౌంటర్ ఇచ్చింది. "ఆల్వేస్ లూజింగ్ బట్ సడెన్లి విన్నింగ్ కెప్టెన్ రోహిణి" అని సాకేత్ అడిగేసరికి ఇమ్ము వెంటనే ఎవరూ రావట్లేదు అనేశాడు.

సుధీర్ కి విజయ్ ఆంటోనీ కూడా పెద్ద ఫ్యాన్

సర్కార్ సీజన్ 5  లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షోకి "మార్గన్"మూవీ టీమ్ వచ్చింది. విజయ్ ఆంటోని, అజయ్ ధిషన్ వచ్చారు. రాగానే "మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్..మీరు ఎంచుకుంటే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి " అంటూ సుధీర్ చెప్పాడు. దాంతో విజయ్ ఆంటోని వెంటనే "నేను కూడా నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని.. నీ షోస్ అన్ని నేను చూసాను. రష్మీతో నీ కెమిస్ట్రీ చాలా ఆసంగా ఉంటుంది" అనేసరికి సుధీర్ సిగ్గుపడిపోయాడు. "సర్ అసలు నేను ఇన్ని షోస్, సినిమాలు ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసా సర్" అనగానే బిచ్చగాడు మూవీలోంచి "ఒక్క పూట అన్నం కోసం" అంటూ సాంగ్ పడేసారు విజయ్. ఇక మూవీలో లేడీ క్యారెక్టర్స్ ఐన బ్రిగిడ సాగ, దీప్ షికా వచ్చారు. సుధీర్ ఐతే "మీరు సర్కార్ గురించి టెన్షన్ పడక్కర్లేదు..బ్రెయిన్ ఉన్నోళ్లు విన్ అవుతారు అసలు బ్రెయిన్ లేనోళ్ళు ఉన్నారనుకోండి" అనేసరికి "యాంకర్ అవుతారు" అంటూ కౌంటర్ వేసింది.

త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్స్ప్రెస్ హరి మూవీ ?

కాకమ్మ కథలు షో ఆహా ప్లాటుఫారం మీద మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ప్రతీ వారం బుల్లితెరకు సంబందించిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది తేజస్విని మడివాడు. అలాగే వాళ్ళ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ని చెప్తూ ఉంటుంది. ఇక రీసెంట్ ఎపిసోడ్ కి అష్షు రెడ్డి, ఎక్స్ప్రెస్ హరి వచ్చారు. ఐతే హరి పాస్ట్ గురించి చెప్పి తేజుని ఏడిపించేసాడు. ఐతే హరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో తేజు చెప్పేసింది. ఇక ఫ్యూచర్ లో జూనియర్ ఎన్టీఆర్ పిక్ ని తేజు చూపించేసరికి హరి ఆశ్చర్యపోయాడు. "హరి నువ్వు ఎప్పటినుంచి తారక్ అన్నతో ఫోటో దిగడం కోసం వెయిట్ చేసి చేసి మిస్ అయ్యావని విన్నాను. నేను తారక్ అన్నతో ఫోటో ప్రామిస్ చేయగలను.