English | Telugu

Illu illalu pillalu : ఇడ్లీలు అమ్ముతూ కన్పించిన శ్రీవల్లి నాన్న.. మరి ఆ పది లక్షలు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -201 లో... ధీరజ్ ని తీసుకొని ప్రేమ గుడికి వస్తుంది. అక్కడ పంతులు మంచిమాటలు చెప్తుంటే.. ప్రేమ వింటూ ఉంటుంది. నేను ఎలాగైనా.. ఎవరు ఏమన్నా కూడా ధీరజ్ కి సాయంగా ఉండాలని ప్రేమ అనుకుంటుంది. ధీరజ్ దగ్గరికి వెళ్లి రెండు వేల్లు చూపించి ఒక వేలిని పట్టుకోమంటుంది. ధీరజ్ పట్టుకుంటుంటాడు.. థాంక్స్ రా అని ప్రేమ అనగానే ఇదివరకు ఇలాగే చేసి ఇంట్లో గొడవకి కారణం అయ్యావ్.. ఇప్పుడు ఏం చేస్తున్నావని ధీరజ్ అనగానే ఏం లేదని ప్రేమ అంటుంది.

ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళింటికి వెళదాం పదా.. పది లక్షల గురించి అడగాలని శ్రీవల్లితో చందు అంటాడు. మా వాళ్ళు ఊళ్ళో లేరని శ్రీవల్లి అనగానే చందు కోపంగా వెళ్లిపోతాడు. అదంతా నర్మద విని శ్రీవల్లి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఏంటి మ్యాటర్ పది లక్షలు ఏంటని అడుగుతుంది. మొగుడు పెళ్ళాం మాట్లాడుకుంటే వింటున్నావా.. బుద్ది లేదా అంటూ శ్రీవల్లి కోప్పడుతుంది. మరొకవైపు ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పాలని నిర్ణయం తీసుకొని వెళ్తుంది. పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటుంది.

అప్పుడే నర్మద ఫోన్ చేసి అర్జెంట్ గా మాట్లాడాలని రమ్మని చెప్తుంది. కాసేపటికి నర్మదని ప్రేమ కలుస్తుంది చందు, శ్రీవల్లి మాట్లాడుకున్నది మొత్తం చెప్తుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కోవాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. అలా వెళ్తుంటే దారిలో శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు రోడ్డుపై ఇడ్లీ అమ్ముతూ కనిపిస్తాడు. ప్రేమ, నర్మదని ఆనందరావు చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో ప్రేమ, నర్మద ఇంటికి వచ్చి.. శ్రీవల్లి అక్క మీ నాన్న ఇడ్లీ అమ్ముతు కన్పించాడని చెప్పగానే అందరు షాక్ అవుతారు. శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.