ఏవి అలనాటి ముద్దులు అంటున్న అర్జున్ కళ్యాణ్..శ్రీసత్య ఫీలవుద్ది అంటున్న నెటిజన్స్
అర్జున్ కళ్యాణ్ బుల్లితెర మీద బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ తర్వాత నువ్వుంటే నా జతగా అనే సీరియల్ లో నటిస్తున్నాడు. అలాగే మూవీస్, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. "బాబు, ప్లే బ్యాక్, పెళ్లి కూతురు పార్టీ" వంటి మూవీస్ లో నటించగా, మిస్సమ్మ, నారి నారి నడుమ మురారి, 7 డేస్ ఆఫ్ లవ్ వంటి వెబ్ సిరీస్ లో కూడా చేసాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో, బిబి జోడిలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఇక ఇప్పుడు "ఏవి అలనాటి ముద్దులు" అనే మూవీలో నటించాడు. ఇప్పుడు ఈ మూవీ ఈటీవీ విన్ విన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.