English | Telugu

Brahmamudi : బాస్ గెటప్ లో ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. శృతి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -764 లో... స్వప్న లాకర్ ఓపెన్ చేయాలని రాహుల్ చూస్తుంటే.. స్వప్న వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయబోతున్నావని స్వప్న అనగానే ఏం లేదని రాహుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రాహుల్ వాలకం చూస్తుంటే మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నాడని స్వప్న అనుకుంటుంది. మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి మాట్లాడుకుంటుంటే అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు.

కావ్య ఏం అంటుందని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. తనకి ఆఫీస్ లో ఏదో ప్రాబ్లమ్ అంట హెల్ప్ చెయ్యమని అంటుందని రాజ్ చెప్పగానే.. ఓహ్ అంతేనా అని అపర్ణ డిస్సపాయింట్ అవుతుంది. అప్పుడే కావ్య వచ్చి మీరు నేర్చుకోవల్సింది చాలా ఉందని రాజ్ ని కావ్య లోపలకి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు అప్పుకి స్వప్న తన ఏడు వారాల నగలు తీసుకొని వచ్చి ఇస్తుంది. వీటిని మెరుగు పెట్టించమని స్వప్న అనగానే సరే అని కావ్య అంటుంది.

రాజ్ కి కావ్య సూట్ వేసి రాజ్ లాగా బాస్ లాగా నడవమని ట్రైనింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రాజ్ కి కావ్య ఎలా తినాలో కూడా ట్రైనింగ్ ఇస్తుంది. అదంతా రుద్రాణి చూసి అసలు కావ్య ఏం చేస్తుందని అనుకుంటుంది. తరువాయి భాగంలో రాజ్ ఆఫీస్ కి వెళ్లి శృతి తో అందరి ఎంప్లాయిస్ పిలవమని చెప్తాడు. దాంతో శృతి కావ్యకి ఫోన్ చేసి రాజ్ సర్ గతం మర్చిపోయాడని ఎంప్లాయిస్ కి ఎవరికి తెలియదు కదా.. ఇప్పుడు సర్ వాళ్లని పిలవమని అంటున్నాడని శృతి అంటుంది. దాంతో కావ్య కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.