English | Telugu

Karthika Deepam2 : దాస్ కి గతం గుర్తొంచిందని చెప్పేసిన దీప.. కాశీ ఏం చేస్తున్నాడంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -410 లో... మా వదినకి కుంకుమ పెట్టు దీప అని కాంచన అనగానే.. వద్దని సుమిత్ర అంటుంది. అయితే మీరు ఇచ్చిన తాంబూలం తీసుకొని వెళ్ళండి అని కాంచన అంటుంది. తప్పక సుమిత్ర దీపతో బొట్టు పెట్టించుకుంటుంది. ఆ తర్వాత తప్పకుండా ఎంగేజ్ మెంట్ కి రావాలని దశరథ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు కాశీకి జ్యోత్స్న ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ స్వప్న లిఫ్ట్ చేస్తుంది. నువ్వెందుకు చేసావని జ్యోత్స్నపై స్వప్న కోప్పడుతుంది. అప్పుడే కాశీ వచ్చి ఫోన్ లాక్కొని బయటకు వెళ్లి మాట్లాడతాడు. దాంతో స్వప్నకి డౌట్ వస్తుంది.

శ్రీముఖి కి స్వయంవరం...గెలిచింది ఎవరు!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో మొత్తం హిస్టారికల్ థీమ్ తో క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. శ్రీముఖి స్వయంవరం ఈ ఎపిసోడ్ లో నిర్వహించబోతున్నారు. దాంతో అవినాష్, హరి కలిసి శ్రీముఖిని బాగా ఎలివేట్ చేశారు. "పరివారం దేశపు యువరాణి..148 ఎపిసోడ్లుగా ప్రయాణం చేస్తున్న అలుపెరగని యోధురాలు..ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందగత్తె.. మా శ్రీముఖి యువరాణి వచ్చేస్తున్నారహో" అని చెప్పారు. దాంతో శ్రీముఖి యువరాణి కాస్ట్యూమ్ మెరిసిపోతూ స్టేజి మీదకు వచ్చింది. ఆ పక్కనే రోహిణి కూడా అదే గెటప్ లో వచ్చింది. దాంతో అవినాష్ "యువరాణి అమ్మగారికి నా ప్రణామాలు" అన్నాడు. "ఆవిడ నా అమ్మగారు కాదు" అంది శ్రీముఖి. "ఇంత అందమైన బొమ్మను చూసి అమ్మా అందువా" అంటూ రోహిణి డైలాగ్ వేసింది. "మరీ చూడడానికి మాసిపోయినట్టు ఉంది" అంటూ కౌంటర్ వేసాడు అవినాష్. "మిమ్మల్ని చూసుకోవడానికి ఎంతో మంది యువరాజులు పక్క రాజ్యం నుంచి వస్తున్నారు" అంటూ శ్రీముఖి స్వయంవరం నిర్వహించారు అవినాష్, హరి.

శ్రీదేవి డ్రామా కంపెనీలో అంజలి సీమంతం..కన్నీళ్లు పెట్టుకున్న ఇంద్రజ, రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఈ ప్రోమోలో అంజలిపవన్ కి సీమంతం చేసే కాన్సెప్ట్ తో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ సీమంతం చేసింది ఎవరో కాదు హోస్ట్ తమ్ముడు రవి..."నేను చందమామ కలిసి మా అక్కకు సీమంతం చేస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు. భార్య సీమంతం సందర్భంగా పవన్ ఐతే ఫుల్ జోష్ తో యమా స్పీడ్ తో డాన్స్ చేసాడు. కానీ ఆ స్పీడ్ డాన్స్ తనకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళ నాన్న పరువు తీసేసింది చందమామ. ఇక శ్రీ సత్య, చందమామ కలిసి "చల్ల గాలి" సాంగ్ కి ఐ-ఫీస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారు. తర్వాత సెట్ లో ఉన్నవాళ్ళంతా కలిసి వచ్చి అంజలికి సీమంతం చేసారు. ఇక పవన్ తన భార్యకు గాజులు తొడిగాడు. ఈ గాజులు నీ చేతి నరాలకు తగిలి ప్రసవం సుఖంగా అవ్వాలని ఈ గాజులు వేస్తున్నా అని చెప్పాడు. తర్వాత రవి ఒక స్కిట్ వేసాడు. ప్రతీ ఇంట్లో మామఅల్లుడు ఎలా ఉంటారో తెలిపే రిలేషన్ ని ఈ స్కిట్ లో చూపించారు.

మాస్టర్ ని పట్టుకుని విజ్జు అనేసిందేంటి జానులిరి

ఢీ 20 ఇది సర్ మా బ్రాండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ విలేజ్ స్పెషల్ థీమ్ గా రాబోతోంది. ఈ ప్రోమోలో జానులిరి విజయ్ బిన్నీ మాష్టర్ ని పట్టుకుని పెద్ద మాటే అనేసింది. "ఈరోజు ఎట్లైతే అట్లా విజ్జుని నా వాడిని చేసుకోవాలి" అంటూ జాను ఇంకో డాన్సర్ కూడా విజయ్ బిన్నీ మాస్టర్  వైపు కొంటెగా చూస్తూ పెళ్లి కలలు కనేసారు. "వన్నెలాడి వన్నెలాడి" అంటూ ఆ సాంగ్ వచ్చింది. ఇక హోస్ట్ నందు ఐతే "మేము పిలవచ్చా విజ్జు అని లేదంటే వన్నెలాడి, టిక్కులాడే పిలవాలా" అని అడిగాడు. "నన్ను విజ్జు అని నా భార్యే ఇప్పటి వరకు పిలవలేదు" అని విజయ్ బిన్నీ మాస్టర్ ఇచ్చేసరికి నందు, జాను ఇద్దరూ తెగ నవ్వేసుకున్నారు.

సుధీర్, గెటప్ శీను లేకుండా ఒక్కడినే స్టేజి ఎక్కినప్పుడు గుండె ఆగిపోయిన్నట్టుగా ఉంది

సర్కార్ సీజన్ 5 ఈ వీక్ ఎపిసోడ్ ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఎందుకు అంటే ఈ వీక్ ఎపిసోడ్ కి వచ్చింది జబర్దస్త్ టీమ్. అంటే సుధీర్ ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ. వీళ్లందరి అల్లరి మాములుగా లేదు. కింద పడి దొర్లి దొర్లి జోక్స్ వేసుకున్నారు. ఇక సుధీర్ ఐతే ఒక టైంలో వాళ్ళ వాళ్ళ లైఫ్ లో స్పైసీ ఇన్సిడెంట్స్ చెప్పమని అడిగేసరికి..రాంప్రసాద్ చెప్తూ ఏడ్చినంత పని చేసాడు. "సీరియస్ నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏడ్చింది లేదు. ఒక్కసారి నేను మీ ఇద్దరూ లేకుండా ఒక షో కోసం స్టేజి ఎక్కా..కుడి భుజం, ఎడం భుజం లేకుండా అంటారు కదా అలా కూడా కాదు. నాకు మెదడు, గుండె పని చేయనంతలా ఐపోయింది.

లక్ష రూపాయలు ఇవ్వబోతున్న శుభశ్రీ ? ఎందుకు ? ఎప్పుడు ? ఎలా ?

ఈరోజున చారిటీ చేయడం అంటే ఎంతో కష్టమైన పని. కానీ కష్టాల్లో ఉన్నవారిని తెలుసుకుని నిజంగా తోచినంత సాయం చేయడం ఈరోజుల్లో ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇంతకు ఈ చారిటీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా.. శుభశ్రీ రాయగురు ఆమె బెటర్ హాఫ్ అజయ్. బిగ్ బాస్ సీజన్ 7  కంటెస్టెంట్ ఈమె. త్వరలో పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఆమె కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేద్దామని అనుకుంటున్నట్టు ప్రకటించింది. "నా పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక పది మందికి ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున ఇద్దామనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో కానీ డి.ఎంలో కానీ మీ రిక్వయిర్మెంట్ ఏముందో చెప్పండి. కానీ అది జెన్యూన్ గా ఉండాలి.