English | Telugu

"ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా"

సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి రామ్ ప్రసాద్, గెటప్ శీను, బులెట్ భాస్కర్, సన్నీ వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ ఐతే అవసరమైనప్పుడల్లా ప్రాపెర్టీస్ తెచ్చే అమ్మాయి లస్సి మీద ఫుల్ జోకులు వేసాడు. లస్సి స్టేజి మీదకు వచ్చేసరికి "పెరుగు ఎవరు తోడెట్టారో కానీ లస్సి అద్దిరిపోయింది" అని జోక్ వేసాడు. సుధీర్ ఐతే "ఒరేయ్ దరిద్రుడా కాసేపు మాట్లాడకుండా ఉండరా" అన్నాడు. "నాకు ఒక స్ట్రా తెస్తావా లస్సి" అని అడిగాడు మళ్ళీ రాంప్రసాద్. లస్సి చేతిలో ఒక ప్రాపర్టీ ఉంది. "అరేయ్ సుధీర్ లస్సిని పట్టుకురమ్మను. ఇంతదూరం వచ్చింది నిన్ను చూడడానికి కాదు. లస్సి ఇటురా" అని పిలిచాడు రాంప్రసాద్.

"నాకు నీ మీద సరిగా నమ్మకం లేదురా" అన్నాడు సుధీర్. "నీకు ఇలా కాదు దుబాయ్ ఫొటోస్ పంపిస్తే గాని" అని రాంప్రసాద్ ఫోన్ తీసి మరీ బెదిరించేసరికి "సర్లే వద్దు కానీ లస్సి రా" అని తీసుకెళ్లి అందరినీ పరిచయం చేసాడు సుధీర్. రాంప్రసాద్ షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి షేక్ హ్యాండ్ వద్దు అన్నా అన్నాడు సుధీర్ ఇంతలో లస్సి కూడా రాంప్రసాద్ కి షేక్ హ్యాండ్ ఇవ్వబోయి సుధీర్ చూపును చూసి ఆగిపోయింది. "ఏంట్రా చూపులతో భయపెడుతున్నావ్" అంటూ సుధీర్ మీద కౌంటర్ వేసాడు గెటప్ శీను. "లక్ష పొతే పోయింది కానీ లస్సి అదిరిపోయింది" అన్నాడు ఆటో రాంప్రసాద్. తర్వాత స్టేజి మీద వీళ్లంతా దొర్లి దొర్లి వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఫొటోస్ ని చూపించుకుని కాసేపు ఎంజాయ్ చేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.