English | Telugu

వెనక్కి తగ్గిన విశ్వక్ సేన్

ఫిబ్రవరి 17న విడుదల కావాల్సిన 'దాస్ కా ధమ్కీ' మూవీ వాయిదా పడే అవకాశముందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ మూవీ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది.

'ఫ‌ల‌క్‌నుమాదాస్‌' తర్వాత విశ్వక్ సేన్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్-1 కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విడుదల తేదీ(ఫిబ్రవరి 17) దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ ఊపందుకోకపోవడంతో ఈ చిత్ర విడుదల తేదీ మారనుందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై మూవీ టీమ్ కూడా క్లారిటీ ఇచ్చేసింది. సీజీ వర్క్ పూర్తికాకపోవడంతో ఫిబ్రవరి 17న విడుదల చేయలేకపోతున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ చిత్రం మార్చి రెండో వారంలో విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి కరాటే రాజు నిర్మాత. నివేథ పేతురాజ్ హీరోయిన్ కాగా రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.