English | Telugu

రజినీకాంత్‌తో మహేష్‌కి చెక్ పెట్టబోతున్న దిల్ రాజు!

డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను ప్రారంభించిన దిల్ రాజు చాలా తక్కువ సమయంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కథల ఎంపికలో ఆయన జడ్జిమెంట్ చాలా బాగా ఉంటుందనే నమ్మకం అందరిలో ఉంది. యాక్షన్ సినిమాలను పక్కన పెడితే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చిత్రాలను ఈయన బాగా జడ్జి చేయగలరని నమ్మకం ఉంది. నిర్మాతగా ఎంతగా ఎదిగినా కూడా ఈయన డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని మాత్రం వదలలేదు. ఈయనకు నైజాం, వైజాగ్ ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ గా చాలా పట్టు ఉంది. ఎన్నో థియేటర్లో ఈయన చేతిలో ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఆయన విజయ్తో వారసుడుగా వచ్చారు. కానీ ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దాంతో దీనికి కారణాలను విశ్లేషించే పనిలో దిల్ రాజు ఉన్నారు. తాజాగా ఆయన చూపు ఇండియన్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ పై పడింది. ప్ర‌స్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సునీల్, తమన్నా భాటియా వంటి భారీ తారాగాణం నటిస్తుంది.

ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను రెండు తెలుగు రాష్ట్రాలలో కొనడానికి దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు అని సమాచారం. అదే రోజున మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ఎస్ఎస్ఎంబి 28 కూడా విడుదల కానుంద‌ని సమాచారం. ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజుకు ఇవ్వకుండా ఏషియన్ ఫిలిమ్స్ కి ఇవ్వాలని ఈ చిత్ర నిర్మాత చిన్నబాబు అలియాస్ కే రాధాకృష్ణ భావిస్తున్నారు. దాంతో మహేష్ బాబు చిత్రానికి చెక్ పెట్టేలా ఈసారి రజినీతో ఆగస్టు 11న థియేటర్లలో నువ్వా నేనా అన్న‌ట్లుగా దిల్ రాజు పోటీ పడబోతున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రాల రిలీజ్ డేట్ల‌పై క్లారిటీ రావాల్సివుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.