English | Telugu

భర్త చనిపోయాక భానుప్రియ ఎక్కడ ఉంటోంది ?

1980 లలో టాలీవుడ్‌లో నటి భానుప్రియ ఒక వెలుగు వెలిగారు. తన కెరీర్‌లో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో మూవీస్ లో నటించారు. ఎన్నో గొప్ప పాత్రలను పోషించారు. అందం, అభినయంతో పాటు డాన్స్ టాలెంట్ ఆమెకు ఉన్న అదనపు క్వాలిఫికేషన్.. ఆమెతో చేసిన ఎంతో మంది ఇప్పటికీ లైం లైట్ లో కనిపిస్తూనే ఉన్నారు. కానీ భానుప్రియ మాత్రం ఎందుకు కనిపించడం లేదు...అసలు ఆమె ఎక్కడ ఉన్నారు అనే ఎన్నో ప్రశ్నలు ఆమె ఫాన్స్ నుంచి వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు భానుప్రియ. "నేను చేసిన సినిమాల్లో నాకు ఎక్కువగా నచ్చేవి సితార, అనాదిగా ఆడది, స్వర్ణకమలం..స్వర్ణ కమలం మూవీకి నంది అవార్డు గెలుచుకున్నా. ఐతే ప్రస్తుతం వయసు పెరగడంతో నాకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు.. అన్ని విషయాలు మర్చిపోతున్నాను. నేను ఒక డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టాలి అనుకున్నా..కానీ డాన్స్ చాలా వరకు మర్చిపోయాను అందుకే ఈ డాన్స్ స్కూల్ ఆలోచనను విరమించుకున్నా. రీసెంట్ గా ఒక మూవీ షూటింగ్ కి వెళ్ళాను అక్కడ చెప్పాల్సిన డైలాగ్స్ అన్నీ మర్చిపోయా..మైండ్ బ్లాంక్ ఐపోయింది.

తర్వాత కొంచెం సర్దుకున్నాక మళ్ళీ చెప్పాను. 'నాట్యం' అనే మూవీలో నటించాను. నా పాత్ర చాలా బాగుంటుందనీ చెప్పారు కానీ అది చేసాక అర్ధమయ్యింది నా క్యారెక్టర్ కి అంత వేల్యూ లేదు అని అప్పుడు మాట్లాడితే గొడవలవుతాయని నేనేమీ మాట్లాడలేదు. నా భర్త చనిపోయాక నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేను మా వారితో డివోర్స్ తీసుకోవడం అనేది రూమర్ మాత్రమే...నాకు షూటింగ్స్ ఉంటే చెన్నై, హైదరాబాద్ వెళ్లి వస్తూ ఉంటాను. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మా అమ్మాయి అభినయ లండన్ కాలేజీలో నేచురల్ సైన్స్ చదువుతోంది. నాతోటి వాళ్లంతా హైదరాబాద్ షిఫ్ట్ ఇపోయారు కానీ నేను మాత్రం చెన్నైలోనే ఉండిపోయాను...అక్కడికి వెళ్లడం మీద పెద్దగా ఇంటరెస్ట్ చూపించలేదు నేను హైదరాబాద్ వెళ్లి అక్కడ మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోయాను. నేను, అమ్మ, అన్నయ్యను, అభినయ ఇక్కడ ఉంటాం..శాంతిప్రియా వాళ్ళ అబ్బాయిలు ముంబైలో ఉంటారు. వాళ్ళు మేము కలుస్తూనే ఉంటాం.." అని చెప్పుకొచ్చారు భానుప్రియ.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.