English | Telugu

కాంతార గురించి రిష‌బ్ ఏమంటున్నారు?

కాంతార సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్ ఇంత ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని రిష‌బ్ శెట్టి కూడా ఊహించ‌లేదు. అందుకే త‌న‌కు తెలిసిన క‌థ‌ను జాగ్ర‌త్త‌గా రాసుకుని తీసేశారు. ఇప్పుడు కాంతార సినిమాకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. అంద‌రూ కాంతార‌2 ఎప్పుడు తీస్తార‌ని అడుగుతున్నారు. మీరు చూసింది సీక్వెలే, ఇప్పుడు మేం అంత‌కు ముందు ఏం జ‌రిగింద‌నే క‌థ‌ను స‌వివ‌రంగా చెప్ప‌బోతున్నాం అని అన్నారు హీరో క‌మ్ డైర‌క్ట‌ర్ రిష‌బ్ శెట్టి. డివైన్ హిట్ మూవీ కాంతార విడుద‌లై 100 రోజులు పూర్త‌య్యాయి.

ఒక సినిమా విడుద‌లై 100 రోజులు అవుతున్నా, దానికి సంబంధించిన మరో ప్రాజెక్టు వ‌ర్క్ ఇంకా ఎందుకు ప్రారంభం కావడం లేద‌ని ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయ‌ట హోంబ‌లే ఫిల్మ్స్ కి. అయితే కాంతార సినిమాకు ప్రీక్వెల్ తీయ‌డం అంత తేలికైన ప‌నికాదు. న‌మ్మ‌కాలు, ఆచారాల‌ను అన్నిటినీ ఈ సినిమాలోనే చూపించాం. దీనికి ముందు ఏం జ‌రిగింది? అస‌లు హీరో తండ్రి అడ‌వుల్లోకి వెళ్లి ఎందుకు మాయ‌మ‌య్యాడు? హీరోని భూత‌కోల‌కు దూరంగా ఉంచాల‌ని త‌ల్లి ఎందుకు అనుకుంది? ఆమెకు పెళ్ల‌యిన కొత్త‌లో అస‌లేం జ‌రిగింది? భూత‌కోల‌లో మ‌నుషులు మాయం కావ‌డం ఏంటి? వంటి అంశాల మీద సంపూర్ణంగా రీసెర్చి చేస్తున్నార‌ట రిష‌బ్ శెట్టి అండ్ టీమ్‌. ఓ వైపు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాల‌ను గౌర‌విస్తూ, ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా, జాగ్ర‌త్త‌గా టైట్ స్క్రీన్‌ప్లేతో క‌థ రాసుకునే ప‌నుల్లో ఉన్నార‌ట రిష‌బ్ అండ్ టీమ్‌. ఒక్క‌సారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకుంటార‌ట‌. ఫ‌స్ట్ పార్ట్ లోనూ ఫారెస్ట్ ఆఫీస‌ర్ల విష‌యం ప్ర‌స్తావ‌న ఉంటుందా? లేకుంటే పూర్తిగా భూత‌కోల ఆచారాల మీద మాత్ర‌మే ఫోక‌స్ చేస్తారా? అనే ఆస‌క్తి కూడా స‌ర్వ‌త్రా క‌నిపిస్తోంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.