English | Telugu

రాజమౌళి శిష్యుడు ఈసారైనా విజయం సాధిస్తాడా?!

రాజమౌళి శిష్యులు దర్శకులుగా రాణించింది చాలా తక్కువ. ఎందుక‌నో సుకుమార్ వంటి వారి శిష్యులు బాగా రాణిస్తుంటే పూరీజ‌గ‌న్నాథ్‌, రాజ‌మౌళి వంటి వారి శిష్యులు మాత్రం స‌క్సెస్ కాలేక‌పోతున్నారు.గ‌తంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రాజ‌మౌళి శిష్యుడు మహాదేవ్ మిత్రుడు అనే చిత్రం చేశారు. కానీ ఈ చిత్రం విజ‌య‌వంతం కాలేదు. ఇక త్రికోటి వంటి వారు దర్శకులుగా పెద్దగా మెప్పించలేకపోయారు. త్రికోటి తీసిన మొదటి చిత్రం దిక్కులు చూడకు రామయ్య. నాగశౌర్య హీరోగా ఈ చిత్రం రూపొందింది. తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించే స్టోరీ లైన్ తో ఇది రూపొందింది. ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అజయ్ నాగశౌర్య తండ్రి కొడుకులుగా నటించారు. 2014లో ఈ చిత్రం విడుదలై పర్వాలేదనిపించింది. వారాహి చలనచిత్ర బ్యానర్‌లో సాయి కొర్రపాటి ఈ మూవీని నిర్మించారు. ఓ విధంగా చెప్పాలంటే రాజమౌళి టీం నుంచే ఈ సినిమా వచ్చింది.

ఆ తర్వాత జువ్వ అనే టైటిల్ తో మరో సినిమాకి త్రికోటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మరల రాజమౌళికి అసోసియేట్ గా త్రికోటి జక్కన్న టీంలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన మూడో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. మగధీర సినిమాలో విలన్ గా నటించిన దేవ్ గిల్ సొంతగా పొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. తను నిర్మాతగా మొదటి సినిమాని త్రికోటి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నటిస్తున్నారు. దేవ్ గిల్ కూడా ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌ను చేయ‌నున్నార‌ని స‌మాచారం. చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తోంది. టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సింహ అనుకున్న స్థాయిలో హీరోగా సక్సెస్ కొట్టలేకపోతున్నారు. మరి రాజమౌళి శిష్యుడు అయినా త్రికోటి అతనికి హిట్టు బొమ్మ ఇస్తాడేమో చూడాలి. కాగా ఈ సినిమాకు వెనక నుండి రాజమౌళి టీమ్ అండ‌ దండలు బాగా ఉన్నాయి. దేవ్ గిల్ కూడా రాజమౌళి సపోర్టుతోనే నిర్మాతగా అడుగులు వేయబోతున్నట్లు టాక్.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.