English | Telugu

కవిగా, రచయితగా పాపులర్ అవుతున్న జనార్దన మహర్షి!

కవిగా, నవలా రచయితగామంచి పేరు తెచ్చుకున్నారు సినీ రచయిత, దర్శకుడు జనార్దన మహర్షి. 2003లో వచ్చిన ఆయన తొలి ప్రచురణ 'వెన్నముద్దలు' అనే కవితా సంకలనం సాహితీ లోకంలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఇది ఇప్పటివరకు 12 ముద్రణలు పొందటం విశేషం.

2004లో 'పంచామృతాలు' అనే కథా సంకలనాన్ని ఆయన వెలువరించారు. ఇక ఆయన 2007లో ప్రచురించిన 'గుడి' నవల, తర్వాత కాలంలో చలనచిత్రంగా రూపొందింది. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె. విశ్వనాథ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఆ సినిమా 'దేవస్థానం'. 2012లో వచ్చిన ఈ మూవీకి జనార్దన మహర్షి స్వయంగా దర్శకత్వం వహించారు. 'గుడి' నవలను 'గర్భగుడిలోకి..' అనే సరికొత్త టైటిల్‌తో 2021లో పునర్ముద్రించారు జనార్దన మహర్షి. ఇది కన్నడంలోనూ అనువాదమైంది.

2008లో 'నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' అనే కవితాత్మక నవల, 2011లో 'కవిగానే కన్నుమూస్తా' అనే కవితా సంకలనం, 2019లో 'మధుర సంభాషణలు' అనే పుస్తకం, అదే సంవత్సరం 'చిదంబర రహస్యం' అనే కథా సంకలనం, 2021లో 'శ్మశానానికి వైరాగ్యం' అనే మరో కథా సంకలనం ఆయన నుంచి వచ్చాయి. చివరగా 2022లో 'జన'పదాలు అనే కవితా సంకలనాన్ని ఆయన ప్రచురించారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.