English | Telugu

రామ్ కోసం ప్రిన్స్ ని రంగంలోకి దింపుతున్న బోయపాటి!

హీరో ప్రిన్స్ గురించి చాలామందికి గుర్తుండే ఉంటుంది. కానీ ఆయనకు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దాంతో ఆయన ఫేడ‌వుట్ అయిపోయారు. తేజ దర్శకత్వంలో వచ్చిన 'నీకు నాకు డాష్ డాష్' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. మారుతి దర్శకత్వం వహించిన 'బస్ స్టాప్' అనే హిట్ చిత్రంలో నటించారు. రొమాన్స్, బన్నీ అండ్ చెర్రీ వంటి చిత్రాలు చేశారు. బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారు. ముఖ్యంగా 'డీజే టిల్లు' చిత్రంలో ఆయ‌న పోషించిన వెరైటీ పాత్ర‌కు ఎంతో పేరు వ‌చ్చింది. ప్రిన్స్ కు సాఫ్ట్ బాయ్ అనే పేరు ఉంది. డీజే టిల్లులో ఆయన విభిన్న పాత్రలో నటించి మెప్పించ‌డంతో ఆయ‌న ఇప్పుడు మాస్, యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కంట్లో ప‌డ్డారు. రామ్ పోతినేని హీరోగా బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రిన్స్ అంతకుమించిన విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ లోని విల‌నిజంను ఈ చిత్రంలో బోయపాటి చూపించబోతున్నార‌ట. ఇప్పటివరకు సాఫ్ట్ పాత్రల‌లో మాత్రమే కనిపించిన ప్రిన్స్ ఈ సినిమా నుండి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ కు మరో విలక్షణ విలన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లభించినట్లేనని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

రామ్, బోయ‌పాటి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బోయపాటి అంటే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉంది. ఆయన తీసే సినిమాలన్నీ కూడా భారీ యాక్షన్ సినిమాలు.... ఊర మాస్ సన్నివేశాలను కలిగి ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ రేంజ్ లో యాక్షన్స్ సన్నివేశాలు బోయపాటి కే సాధ్యం. బి.గోపాల్, వినాయక్ ల తరువాత ఆస్థానం బోయపాటిది. లెజెండ్ సినిమాతో జగపతిబాబును విల‌న్ గా చూపించి మెప్పించారు. ఈ సినిమాతో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా జగపతిబాబు బిజీ అయిపోయారు. అఖండ సినిమాలో శ్రీకాంత్ ను విలన్ గా చూపించారు. ప్రస్తుతం రామ్ తో చేస్తున్న చిత్రంలో ప్రిన్స్ ని విలన్ పాత్రలో చూపించనున్నారని వినికిడి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.