English | Telugu

ప్రభాస్, మహేష్.. తెలుగు హీరోలపై కన్నేసిన దీపిక!

తన అందాలతో మతులు చెడగొట్టే బ్యూటీ హీరోయిన్ దీపికా పడుకోణె. ఈ పొడుకాళ్ల సుందరి తన అందాలతో అందరి మతులు చెడగొడుతుంది. తాజాగా ఈమె నటించిన 'పఠాన్' చిత్రంలో బికినీ ధరించి విచ్చ‌ల విడిగా త‌న అందాల‌ను ఆర‌బోసింది. అందాలు ఆరబోయడంలో తనను కొట్టే వాళ్లే లేరని ఆమె నిరూపించింది. ఇక ఈమె పఠాన్ చిత్రంలో కింగ్ ఖాన్ కు దీటుగా ఫైట్స్ లో కూడా మెప్పించి డేరింగ్ అండ్ డాషింగ్ గా మైమరిపించింది.

కాగా ఆమె ప్రస్తుతం నాగ్అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ విందును అందించడానికి రెడీ అవుతోంది. ఇంకా రాజమౌళి -మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో కూడా ఈమె నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆమె స్టంట్స్ తో అదరగొట్టనుందని సమాచారం.

ప్రభాస్, మహేష్ తోనే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో ఈమె చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతో టాలీవుడ్ నుంచి వచ్చిన ఏ అవకాశాన్ని ఆమె వదులుకోకుండా జాగ్రత్త తీసుకుంటుంది. తెలుగు చిత్రాల‌లో నటిస్తే దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు వస్తుంది. బాలీవుడ్ లో ఎలాగూ గుర్తింపు ఉంది. అలా పాన్ ఇండియా లెవెల్ లో ఆమె సాగిపోతుంది. పాన్ ఇండియా ఇమేజ్ ఉంటుంది కాబట్టి రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది. క్రేజ్ ఇమేజ్ కూడా దేశవ్యాప్తంగా మారుమోగిపోతాయి. దాంతో ఈ దిశగా దీపిక అడుగులు వేస్తోంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.