English | Telugu

నెల్స‌న్‌ని చూస్తే భ‌యంగా ఉందంటున్న నెటిజ‌న్లు!

అస‌లే అక్క‌డున్న‌ది ఇండియ‌న్ ప‌వ‌ర్‌హౌస్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌. సినిమాలో ఆయ‌న్ని చూడ్డానికే రెండు క‌ళ్లు స‌రిపోవు. అలాంటిది మ‌ల‌యాళం మోహ‌న్‌లాల్‌, నార్త్ నుంచి జాకీష్రాఫ్‌, తెలుగు ఆర్టిస్ట్ సునీల్‌, క‌న్న‌డ శివ‌రాజ్‌కుమార్‌, వీళ్లంద‌రూ చాల‌ర‌న్న‌ట్టు త‌మిళ్ నుంచి శివ‌కార్తికేయ‌న్‌, శివ‌గామి ర‌మ్య‌కృష్ణ, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా.... ఇంత మందితో డైర‌క్ట‌ర్ నెల్స‌న్ ఏం చేస్తారు? ఎలా తీస్తారు? తాను రాసుకున్న స్క్రిప్ట్ లో ఇంత మందికి బ‌ల‌మైన కేర‌క్ట‌ర్ల‌ను ఎలా స‌ర్దుతారు? అనే క‌న్‌ఫ్యూజ‌న్ క‌నిపిస్తోంది జ‌నాల్లో. ఇంత‌మందితో నెల్స‌న్ తీస్తున్న జైల‌ర్ సినిమా ఇప్పుడు జైస‌ల్మేర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

త‌లైవ‌ర్‌ని అక్క‌డే చూసిన‌ట్టు నెట్టింట్లో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి చెయ్యి ఊపుతూ ఉన్న ర‌జ‌నీకాంత్ వీడియోల‌ను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇండియ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ లోడింగ్ అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టారు. మ‌రో నెటిజ‌న్ అయితే, నెల్స‌న్ తీసే ఈ సినిమాతో ఇంత మంది న‌టుల‌కూ మంచి హిట్ ప‌డాలి. లేకుంటే పులిహోరే అవుతుంది అని స‌ర‌దాగా కామెంట్ చేశారు. ర‌జ‌నీకాంత్‌తో న‌టించాల‌నే త‌న చిర‌కాల క‌ల నెర‌వేరింద‌ని ఆ మ‌ధ్య ఈ సినిమాలో తాను న‌టిస్తున్న విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు త‌మ‌న్నా. ముందు ఈ సినిమాను వినాయ‌క‌చ‌వితి టైమ్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.

అయితే ఇప్పుడు షూటింగ్ లేట్ కావ‌డంతో, సినిమాను దీపావ‌ళికి పోస్ట్ పోన్ చేశారు మేక‌ర్స్. దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత దీపావ‌ళి రేసులో క‌మ‌ల్‌హాస‌న్‌తో ఢీకొట్ట‌బోతున్నారు ర‌జ‌నీకాంత్‌. క‌మ‌ల్‌హాస‌న్ ఓ వైపు రాజ‌కీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నారు. ర‌జ‌నీకాంత్ మాత్రం ఆదిలోనే త‌న‌కు రాజ‌కీయాలు స‌రిపోవని అర్థం చేసుకుని, ఫ్యాన్స్ కి పెద్ద లేఖ రాసి ప‌క్క‌కు జ‌రిగారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.