English | Telugu

రెమ్యూనరేషన్ లో తగ్గేదే లే అంటున్న పాన్ ఇండియా స్టార్!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఏడు చిత్రాలు ఉన్నాయి. ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతీ చిత్రం, సిద్ధార్థ ఆనంద్ చిత్రం, సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోయే స్పిరిట్ మూవీ, దిల్ రాజు నిర్మాత‌గా స‌లార్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తో మ‌రో చిత్రం... ఇలా పలు చిత్రాలను ఆయన లైన్ లో పెట్టారు. ఆది పురుష్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక సలార్, ప్రాజెక్టు కే సినిమాలను స‌మాంత‌రంగా పూర్తి చేస్తూ వస్తున్నారు. మధ్యలో సమయం దొరికినప్పుడు మారుతి చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేస్తున్నారు.

ఇలా ఈ మూడు చిత్రాలు ఒకే సమయంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభాస్- సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ తీసిన పఠాన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం వారం రోజుల‌ లోపల 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ ఫిగర్ మరింత మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో సిద్ధార్థ్ ఆనంద్ చేయబోతున్న ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్దార్ధ్ ఆనంద్ మైత్రి వారిని ఏకంగా 150 కోట్ల రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. మైత్రి మూవీస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం మార్కెట్ వేల్యూ పరంగా 150 కోట్లు ప్రభాస్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడే 150 కోట్లు అడుగుతుంటే త‌న‌కి 150 కోట్లు ఇవ్వ‌డానికి అభ్యంత‌రం ఏమిట‌నేది ప్ర‌భాస్ లాజిక్. తన మార్కెట్ వాల్యూ, స్టార్డమ్ 150 కోట్లు అని ఆయన చెబుతున్నారు. దానికి తగ్గట్టుగా తన పారితోషకం ఉంటేనే సరే లేకపోతే నో అని చెప్పడానికి ఏమాత్రం సందేహించడం లేదు. మొత్తానికి ఇండియాలో ప్రస్తుతం 150 కోట్ల మార్కెట్ ఉన్న హీరో బహుశా పాన్ ఇండియా స్టార్ ప్రభాసే కావచ్చు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.