English | Telugu

2018 మూవీ ఇష్యూ... కేర‌ళ థియేట‌ర్లు బంద్‌!

టొవినో థామ‌స్ హీరోగా న‌టించిన సినిమా 2018. కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించారు. ఆద్యంతం భావోద్వేగభ‌రితంగా రూపొందించారు డైర‌క్ట‌ర్‌. ఈ సినిమాను ఇటీవ‌ల తెలుగులో విడుద‌ల చేశారు. కొన్న‌దానికి ప‌దింత‌ల లాభం తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో జూన్ 7 నుంచి ప్ర‌సారం చేయ‌నున్నారు. ఇది కేర‌ళ థియేట‌ర్ ఓనర్స్ ని అప్‌సెట్ చేసింది. అందుకే జూన్ 7, 8న ప్రొటెస్ట్ చేయ‌నున్నారు. ఇంత త్వ‌ర‌గా ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న‌. థియేట‌ర్స్ లో 2018కి బ్ర‌హ్మాండ‌మైన ర‌న్ ఉంది. ఇప్పుడు క‌నుక ఓటీటీలో విడుద‌ల చేస్తే వ‌చ్చేవారు కూడా రారు. అందుకే కేర‌ళ థియేట‌ర్ ఓన‌ర్లు స‌మావేశ‌మ‌య్యారు. సినిమా విడుద‌లైన ఐదు వారాల్లోపే ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న‌.

అయితే జూన్ 7 నుంచి ఈ సినిమా ఓటీటీల్లో అందుబాటులో ఉంటుంద‌ని డిజిట‌ల్ ప్లాట్‌ఫార్మ్ మే 28నే అనౌన్స్ చేసింది. మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, హిందీలోనూ అందుబాటులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. అప్పుడు దీని గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కాక‌పోతే ఇప్పుడు సినిమాకు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. 200 కోట్ల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌సూళ్లున్నాయి. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌సార‌మైతే ఆ రికార్డు క్రియేట్ అయ్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఒక వెర్ష‌న్‌. ఐదేళ్ల క్రితం కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ఆ నేప‌థ్యంలో తెర‌కెక్కిందే 2018. ఇప్ప‌టివ‌ర‌కు మోహ‌న్‌లాల్ న‌టించిన పులిమురుగ‌న్ కేర‌ళ‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా రికార్డుల్లో ఉంది. ఈ రికార్డును కూడా 2018 తుడిచిపెట్టేసింది. జూడ్ ఆంటోని జోసెఫ్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్ప‌టిదాకా 170 కోట్లు క‌లెక్ట్ చేసింది. కుంచెకో బొబ్బ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, ఆసిఫ్ అలీ, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ అప‌ర్ణ బాల‌ముర‌ళి, అజు వ‌ర్గీస్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.