ఇది తప్పుడు కేసని పక్కా ఆధారాలతో నిరూపిస్తా!
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని.. త్వరలోనే నిజానిజాలతో అందరి ముందుకు వస్తానని.. బుల్లితెర నటుడు, యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి తెలిపారు. ఓ మహిళను మోసం చేయడమే కాకుండా.. లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో రెండు రోజుల క్రితం నరసింహారెడ్డిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.