English | Telugu

మోసం చేశాడ‌ని ఆరోపించిన భార్య‌.. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన న‌టుడు!

ఇటీవ‌ల వార్త‌ల్లోకెక్కిన మ‌ల‌యాళం టీవీ న‌టి అంబిలీ దేవి భ‌ర్త‌, న‌టుడు ఆదిత్య‌న్ జ‌య‌న్ ఆత్మ‌హ‌త్య య‌త్నం చేశారు. అందిన స‌మాచారం ప్ర‌కారం ఆదివారం సాయంత్రం త్రిసూర్‌లోని త‌న కారులో అత‌ను చేయి న‌రాల‌ను కోసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. వెంట‌నే అత‌డిని త్రిసూర్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్ర‌స్తుతం అత‌ను ఐసీయూలో ఉన్నాడు.

"అత‌ను అధిక మోతాదులో నిద్ర‌మాత్రలు మింగాడు. అత‌డి పొట్ట‌ను శుభ్రం చేశాం. చేతి మ‌ణిక‌ట్టు ద‌గ్గ‌ర కోసుకున్న గాయం ఉంది. త‌దుప‌రి చికిత్స కోసం స‌ర్జ‌న్‌ను సంప్ర‌దిస్తున్నాం. రోగి కొంచెం మ‌గ‌త‌లో ఉన్నాడు కానీ రెస్పాండ్ అవుతున్నాడు. 24 నుంచి 48 గంట‌ల అబ్జ‌ర్వేష‌న్ త‌ర్వాతే వివ‌రాలు తెలియ‌జేస్తాం." అని హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలిపాయి.

భార్య అంబిలీదేవితో వ్య‌క్తిగ‌త గొడ‌వ‌ల కార‌ణంగా అత‌ను ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచాడు. ఆదిత్య‌న్ త‌న‌ను మోసం చేశాడ‌ని అంబిలి ఆరోపించారు. విడాకులు ఇవ్వ‌మని అడుగుతున్నాడ‌నీ, లేదంటే చంపుతాన‌ని బెదిరిస్తున్నాడ‌నీ ఆమె ఆదిత్య‌న్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఆమె ఆరోప‌ణ‌ల‌ను ఆదిత్య‌న్ ఖండించాడు. త‌న‌కు చెడ్డ‌పేరు తీసుకురావ‌డానికి అలాంటి ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌ల్ని ఉప‌యోగించుకోవ‌ద్ద‌ని అత‌ను కోరాడు.

2019లో అంబిలీదేవి, ఆదిత్య‌న్ జ‌య‌న్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఆ ఇద్ద‌రూ 'సీతాక‌ల్యాణ‌మ్‌' అనే టీవీ షోలో జంట‌గా న‌టించారు. ఆ ఇద్ద‌రికీ అర్జున్ అనే కొడుకు ఉన్నాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.