English | Telugu

తోటి జడ్జిల‌తో గొడవకు దిగిన మోనాల్!

'సుడిగాడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హీరోయిన్ మోనాల్ గజ్జర్. ఆ తరువాత టాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేసిన ఈమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. సుదీర్ఘ విరామం అనంతరం బిగ్ బాస్ షో కోసం మళ్లీ తిరిగి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి మోనాల్ క్రేజ్ పెరిగిపోయింది. తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత ట్రయాంగిల్ లవ్ స్టోరీతో బాగా ఫేమస్ అయింది. గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకులతో హౌస్ లో ఎక్కువ కాలం ఉండగలిగింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత మోనాల్ కి ఆఫర్లు తెగ వస్తున్నాయి.

ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రముఖ ఛానెల్ లో ఓంకార్ నిర్వహిస్తోన్న 'డాన్స్ ప్లస్' అనే షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది మోనాల్. ఈ షో కోసం మొదట్లో గ్లామరస్ గా కనిపిస్తూ వ‌చ్చిన‌ మోనాల్.. ఈ మధ్యకాలంలో సంప్రదాయబ‌ద్ధంగా కనిపిస్తోంది. ఇటీవల మోనాల్ మెంటర్ గా వ్యవహరిస్తోన్న టీమ్ కి తక్కువ స్టార్లు రావడంతో షో నుండి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో మోనాల్ చాలా ఎమోషనల్ అయింది.

ఇక రీసెంట్ గా ఈ షోకి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఇందులో మోనాల్ మిగిలిన జడ్జిలు అందరితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. తన టీమ్ ని సపోర్ట్ చేయలేదని మోనాల్ చెబుతున్న సమయంలో యశ్వంత్ మాస్టర్ కలుగజేసుకొని ఆమెకి కౌంటర్ ఇచ్చాడు. దానికి బాబా భాస్కర్ చప్పట్లు కొట్టాడు. దీంతో ఆమెకి కోపం మరింత పెరిగింది. ''ఎందుకు చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏమైందని..? దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి'' అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది. ఈ ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.